మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17, 1954లో సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు.
1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు.
చదువులో చురుగ్గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు.
1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరాడు.
1983లో టీడీపీలో చేరి 1985 నుంచి ఓటమెరుగని నేతగా నిలిచారు.
1985లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.
ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.
1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు.
2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.
2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు.
మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జూన్-2-2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు.
తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్లపాటు సేవలందించారు.