కార్తీక మాసం విశిష్టత తెలుసా..?
కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల
శ్లోకం..
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు.. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు.. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు.. గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు.
ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు.
ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు.
హిందువులు ఈ నెలలో శివుడిని, విష్ణువుని పవిత్రంగా కొలుస్తారు.
శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.