కంటి ఆరోగ్యానికి క్యారెట్స్, స్ట్రాబెర్రీలు చాలా ఉపయోగపడుతాయి.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది.
అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి.. ఫ్రీరాడికల్స్ నుంచి కళ్లను కాపాడుతుంది.
గర్భిణులకు కావలసిన ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్.
స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సి ని అందిస్తాయి.
ఇది రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది.
విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్లు, బ్యాక్టీరియా, క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడతాయి.
క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇతర పండ్లతో పోలిస్తే స్ట్రాబెర్రీలలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ తక్కువ శాతం ఉంటుంది.