మల్లంపల్లి చంద్రశేఖర్ రావు 1942, మే 23న కృష్ణా జిల్లాలో జన్మించారు.
కళాతపస్వి దర్శకుడు కె విశ్వనాథ్ కి బంధువు అవుతాడు.
అప్పట్లో చంద్రమోహాన్ ది లక్కి హ్యాండ్ అని తనతో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ కు తరువాత మంచి అవకాశాలు వచ్చి తారా స్థాయికి వెళ్లేవారు.
చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.
శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి ఇలా ఎంతో మంది హీరోయిన్లు మొదట ఆయన సరసన నటించిన తరువాతే వారికి స్టార్ డమ్ వచ్చింది.
హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయా విలన్.. కమెడియన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు చంద్ర మోహన్.
ఇప్పటి వరకు 1000 సినిమాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో కథానాయకుడిగా నటించడం విశేషం
సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న చంద్రమోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు.