25వ మచిలీపట్నం పాత విద్యార్థుల సమ్మేళనం
ప్రతీ మనిషి జీవితంలో ఎంతో అపురూపమై ఘట్టం, మరిచిపోలేని స్నేహం, వీడలేక వీడిపోయే బంధం.. ఇవన్నీ దక్కేది కేవలం చదువుకునే రోజుల్లోనే. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగిన చాలా మందిని ఒకే చోట చేర్చి..
ప్రతీ మనిషి జీవితంలో ఎంతో అపురూపమై ఘట్టం, మరిచిపోలేని స్నేహం, వీడలేక వీడిపోయే బంధం.. ఇవన్నీ దక్కేది కేవలం చదువుకునే రోజుల్లోనే. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగిన చాలా మందిని ఒకే చోట చేర్చి.. విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా.. జీవితంలో మర్చిపోలేని బంధాలను, బంధువులను ఇస్తుంది స్కూల్. అందుకే చాలా మంది ఎంత బిజీగా ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. వీలు చేసుకుని మరీ పూర్వ విద్యార్థుల కలయికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ అందరికీ అదృష్టం దక్కకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసమే మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక పేరుతో ఓ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు అలివ్ మిఠాయి దొరరాజు గారు.
25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక జనవరి 26న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో బందరులో చదువుకున్న చాలా మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరిని ఒకరు పలకరించుకుని తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను తల్చుకుని ఎంజాయి చేసిన వాళ్ల మధ్యలో కనిపించిన ఎమోషన్స్ అన్నీ ఇన్నీ కావు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో పాత మిత్రులను కలవడం అనేది ప్రతీ ఒక్కరి అదృష్టమని చెప్పారు. ఏ బిజినెస్ చేసినా.. ఎంత సంపాదించినా.. మన అనుకున్న మిత్రులను కలిసినప్పుడు వచ్చే సంతోషం వేరని.. దానికి ఎవరూ వెలకట్టలేని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర..25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి వచ్చిన ప్రతీ విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలివ్ మిఠాయి దొరరాజు. ప్రతీ ఏడు ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. బంధాల విలువ తెలిసేలా చేయడమే తమ ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు డైరెక్టర్ మారుతి. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. తన ఊర్లోనే చదువుకున్న చాలా మంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బంధాలు విడిపోకుండా ఉంటాయంటూ చెప్పారు.ఇక చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆలివ్ మిఠాయి తరఫున ప్రోత్సాహకాలు అందించారు. ఆలివ్ మిఠాయి ఈ పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. చదువులో ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా అండగా ఉంటూనే వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడు కూడా మెరిట్ స్టూడెంట్స్‌కు ప్రోత్సహకాలు అందించారు.
చాలా ఏళ్ల తరువాత తమ పాత మిత్రులను కలుసున్న సంతోషంలో ప్రతీ ఒక్కరూ కార్యక్రమంలో సంతోషం వ్యక్తిం చేశారు. పాత జ్ఞాపకాలు.. మర్చిపోలేని రోజులు.. స్కూల్ డేస్.. క్లాస్‌లో చేసిన అల్లర్ల ముచ్చట్లతో అక్కడ కనిపించిన ఎమోషన్స్ అన్నీ ఇన్నీ కావు.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన పక్కనే ఉన్నవాళ్లతోనే టైం గడపడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఇక పాత స్నేహితులను కలవడం అంటే చాలా మందికి అది కలే. కానీ ఆ కలను నిజం చేస్తే ఎంతో మంది విద్యార్థులను తమ పాత మిత్రులతో కలుపుతోంది ఆలివ్ మిఠాయి సంస్థ. ప్రతీ ఏడు ఆలివ్ మిఠాయి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు బందరులో చదువుకున్న పాత విద్యార్థులు.