AP TEACHERS SCAM : టీచర్ల బదిలీలో 40 కోట్ల స్కామ్.. బొత్సాకు ముట్టింది ఎంత ?
ఏపీలో ఎన్నికలకు (AP elections) ముందు చేపట్టిన టీచర్ల బదిలీపై ఫుల్ కాంట్రోవర్సీ నడుస్తోంది. ప్రభుత్వం మారడంతో దాదాపు 2వేల మంది టీచర్ల బదిలీ (YCP government) నిలిచిపోయింది.

40 crores scam for teacher transfers.. How much did Botsa get?
ఏపీలో ఎన్నికలకు (AP elections) ముందు చేపట్టిన టీచర్ల బదిలీపై ఫుల్ కాంట్రోవర్సీ నడుస్తోంది. ప్రభుత్వం మారడంతో దాదాపు 2వేల మంది టీచర్ల బదిలీ (YCP government) నిలిచిపోయింది. దాంతో ట్రాన్సఫర్ల కోసం భారీగా డబ్బులు ఇచ్చిన టీచర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ స్కామ్ లో 40 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇవన్నీ అధికారులే మింగేశారా ? అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) కూడా ముట్టాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ (new government) హయాంలో హడావిడిగా చేపట్టిన టీచర్ల (teachers) బదిలీలను విద్యాశాఖ నిలిపివేసింది. ఎన్నికల కోడ్ కి కొన్ని రోజుల ముందు ట్రాన్స్ ఫర్ల కోసం టీచర్లు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. కోడ్ ముగిశాక… వాళ్ళంతా కొత్త ప్రాంతాల్లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ పాత బదిలీలను విద్యాశాఖ రద్దు చేయడంతో డబ్బులు కట్టి మోసపోయిన టీచర్లు లబోదిబో మంటున్నారు. ఒక్కో టీచర్ 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల దాకా ట్రాన్స్ ఫర్ కోసం ఖర్చుపెట్టినట్టు తేలింది. వాళ్ళు నివాసం ఉంటున్న పట్టణాలు, నగరాలకు దగ్గర్లోకి వచ్చేందుకు… వివిధ కారణాలతో బదిలీలు చేయించుకున్నారు. బొత్స సత్యనారాయణ, ఆయన పేషీలోని పీఏ, కొందరు విద్యాశాఖ అధికారులు కలసి… మొత్తం 40 కోట్ల రూపాయల దాకా దండుకున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. బదిలీ నిలిచిపోవడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇక తమ డబ్బులు తిరిగి ఎలా వస్తాయని టీచర్లు ఆందోళన పడుతున్నారు. విజయవాడలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ 40 కోట్ల స్కామ్ పై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ సైలెంట్ అయ్యారు.
ఈ బదిలీల సంగతి మాజీ సీఎం జగన్ (CM Jagan) కి కూడా తెలియకుండా జరిగిందని అంటున్నారు. ఇప్పుడు టీచర్లు ఆందోళన చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని ఆందోళనలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు. టీడీపీ (TDP) ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తే.. బొత్సతో పాటు అధికారులపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో దారుణంగా ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి… ఈ టీచర్ల ట్రాన్స్ ఫర్ ఇష్యూతో మరింత పరువుపోయే అవకాశముంది. కూటమి సర్కార్ పెట్టే మొదటి కేసు కూడా ఇదే అవుతుందని అంటున్నారు.