YCP INDIA TODAY PKG : జగన్ ని దెబ్బకొట్టే 5 కారణాలు.. ఇండియా టుడే సర్వే ఏం చెప్పిందంటే

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈలోగా వెలువడిన ఎగ్జిట్ ఫలితాలతో లీడర్లతో పాటు జనం కూడా మరింత గందరగోళంలో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2024 | 01:01 PMLast Updated on: Jun 03, 2024 | 1:01 PM

5 Reasons To Hit Jagan What India Today Survey Said

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈలోగా వెలువడిన ఎగ్జిట్ ఫలితాలతో లీడర్లతో పాటు జనం కూడా మరింత గందరగోళంలో ఉన్నారు. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా రిలీజ్ చేసిన సర్వే…ఏపీలో ఎన్డీఏ కూటమిదే గెలుపు అని చెప్పింది. టీడీపీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) తో కూడిన కూటమికి 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార పార్టీ వైసీపి (YCP) కి 55 నుంచి 77 స్థానాలు దక్కుతాయని తెలిపింది.

ఏపీలో సీఎం జగన్ (CM Jagan) ను దెబ్బతీయనున్న ఐదు అంశాలను విశ్లేషించింది ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే. ఓట్లు, సీట్ల అంచనాలతో పాటు రాష్ట్ర ప్రజల మనోగతాన్ని కూడా సేకరించినట్టు తెలిపింది. అందులో 1 … రాష్ట్రంపై అప్పుల భారం… కనిపించని అభివృద్ధి జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాలనలో అడ్డగోలు అప్పులే ఆయన్ని దెబ్బతీస్తాయంటోంది సర్వే. రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది. ఇందులో నవరత్నాలకే ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి… మౌలిక సదుపాలను పట్టించుకోలేదని అంటోంది సర్వే. విద్యుత్ సరఫరాలో కోతలు, పవర్ ఛార్జీలు పెంపు, తాగునీటి కొరత, నిత్యావసర ధరల పెరుగుదలతో జనంలో వ్యతిరేకత పెరిగింది. ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. దాంతో యూత్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమికి జై కొట్టారని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.

రెండో కారణం: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ స్ట్రాటజీ బాగా దెబ్బకొట్టినట్టు ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే చెబుతోంది. జనంలో వ్యతిరేకత ఉందని కొందరు అభ్యర్థులను మార్చారు జగన్. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించారు. ఈ మార్పులు, చేర్పులతో వైసీపీలో సెకండ్ కేడర్, కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. దాంతో చాలామంది అసంతృప్తితో వైసీపీని కాదని… ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు సహకరించినట్టు సర్వే చెబుతోంది.

జగన్ ను దెబ్బతీయబోయే మూడో కారణం… చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఆయనపై సానుభూతి పెరిగింది. బాబు అరెస్ట్ కు నిరసనగా ఏపీలో నిరసన కార్యక్రమాలు చేయడం… వివిధ వర్గాల నుంచి ఆయనకు మద్దతు రావడం టీడీపీకి ప్లస్ అయిందని ఇండియా టుడే సర్వే తెలిపింది.

జగన్ పై కాపులకు కోసం నాలుగో కారణం… ఏపీలో కీలక ఓటు బ్యాంక్ కలిగిన కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల సంగతిని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మైనార్టీల ఓట్ల కోసం ముస్లింలకు 4 శాతం కోటా ఇవ్వడం కూడా కాపుల్లో కోపానికి కారణమైందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే చెబుతోంది.
జగన్ ను దెబ్బతీయబోయే ఐదో కారణం… ఏపీలో టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే… అందుకు ప్రధాన కారణం జనసేన, బీజేపీయే. పవన్ కల్యాణ్ పై యూత్ లో ఉన్న క్రేజ్ మిగతా రెండు పార్టీలకు కలిసొచ్చింది. వైసీపీ విధానాలు, జగన్ అవినీతి పాలన అంటూ పవన్ కల్యాణ్ ఉతికి ఆరేశాడు. అలాగే చంద్రబాబుని జైల్లో పరామర్శించి… సంఘీభావం తెలిపారు. బయటకు వచ్చి కూటమిగా ముందుకెళతామని పవన్ చెప్పడం… ఏపీలో సామాజిక సమీకరాణాలను మార్చేసింది అంటోంది ఇండియా టుడే సర్వే. బీజేపీకి కూడా పవన్ కల్యాణ్ అండదండలు కలిసొచ్చాయని చెబుతోంది. ఇండియా టుడే విశ్లేషణ కరెక్ట్ అవుతుందా… ఏపీలో జగన్ ఓడిపోయి… ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది.