AP Cabinet : నేడు ఏపీ సచివాలయంలో 8మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

8 Ministers taking charge in AP Secretariat today..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇంకా మంత్రి వర్గంలో 8 మంది తమ మంత్రుత్వ శాఖ బాధ్యతలు స్వీకరించ లేదు. దీంతో నేడు ఒక సారి ఏపీ సచివాలయంలో తమ తమ మంత్రిత్వ శాఖలను స్వీకరించనున్నారు.
నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.