YCP MLA arrested : బాలికపై లైంగిక వేధింపుల కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..
ఏపీలో ప్రభుత్వం మారింది.. ఒకదాని తర్వాత ఒకటి రాజకీయ సంచనాలు కనిపిస్తున్నాయ్. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్.

A case of sexual harassment of a girl.. Former YCP MLA arrested..
ఏపీలో ప్రభుత్వం మారింది.. ఒకదాని తర్వాత ఒకటి రాజకీయ సంచనాలు కనిపిస్తున్నాయ్. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్. పార్టీ ఆఫీసుల కూల్చివేత నుంచి.. నేతల అరెస్టుల వరకు.. వైసీపీ, టీడీపీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. మరో సంచలనం చోటుచేసుకుంది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని.. ఈ కేసు ఫైల్ చేశారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు.
ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలోనే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏపీ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో సుధాకర్ తీరుపై అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఐతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సుధాకర్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణలతో.. 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుధాకర్ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీశ్‌కు టికెట్ కేటాయించారు. అయినా కోడుమూరులో వైసీపీకి ఓటమి తప్పలేదు.