NTR babu : చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్…

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో (AP Assembly Elections) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఏపీ ప్ర‌జ‌లు అధికార పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2024 | 11:15 AMLast Updated on: Jun 11, 2024 | 11:15 AM

A New History Has Unfolded In The State Of Andhra Pradesh In The Assembly Election Results

 

 

 

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో (AP Assembly Elections) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఏపీ ప్ర‌జ‌లు అధికార పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. తెలుగుదుశం కూట‌మికి భారీ మెజార్టీతో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. చంద్ర‌బాబు సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌న్న బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చాటారు. స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌జా తీర్పుతో చంద్ర‌బాబు నాయుడు జూన్ 12న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎంగా తెలుగుదేశం (Telugu Desam Party) అధినేత చంద్ర‌బాబు (Chandrababu) ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, రాజకీయ ప్రముఖులు హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి కుటుంబ స‌భ్యుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌వేళ ఆహ్వానం అందితే జూనియ‌ర్ ఎన్టీఆర్ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారా అనే అంశంపైనా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో కూట‌మి (AP Politics) ఘ‌న విజ‌యం త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియ‌మైన చంద్ర‌బాబు మావ‌య్య‌కి ఈ చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని సాధించినందుకు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మీ విజ‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌ంలో న‌డిపిస్తుంద‌ని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బాల‌కృష్ణ బాబాయి, నారా లోకేశ్‌, భ‌ర‌త్, పురందేశ్వ‌రి అత్త‌కి నా శుభాకాంక్ష‌లు అంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్ర‌బాబు, నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది. చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించని జూనియర్ ఎన్టీఆర్‌.. కూట‌మి విజ‌యం త‌రువాత స్పందించ‌డంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ న‌డుస్తుంది.

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకీ, నందమూరి, నారా ఫ్యామిలీకి జూనియ‌ర్‌ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు

నంద‌మూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ గురించి కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు.. బాధను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే.. ఈమధ్య ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం మానేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో తెలియదని నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం త‌ర‌పున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయ‌న వ‌చ్చే అవకాశాలు లేవన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. తెలుగుదేశం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి స‌మ‌యంలో స్పందించ‌ని ఎన్టీఆర్‌.. ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.