AP Alliance : తొలి సంతకం ఎక్కడ బాబు గారు..
అధికారంలోకి రాగానే తొలి సంతకం పలానా దాని మీదే అంటూ.. నేతలంతా ప్రచారంలో హడావుడి చేస్తుంటారు. ఎవరైనా సరే.. అలా చెప్పారంటే ప్రమాణస్వీకారం చేయగానే.. అదే స్టేజీ మీద ఆ ఫైల్ మీద సంతకం చేస్తారు.
అధికారంలోకి రాగానే తొలి సంతకం పలానా దాని మీదే అంటూ.. నేతలంతా ప్రచారంలో హడావుడి చేస్తుంటారు. ఎవరైనా సరే.. అలా చెప్పారంటే ప్రమాణస్వీకారం చేయగానే.. అదే స్టేజీ మీద ఆ ఫైల్ మీద సంతకం చేస్తారు. అప్పట్లో వైఎస్ నుంచి.. తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) వరకు ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఐతే చంద్రబాబు మాత్రం.. తొలి సంతకం ఇంకా పెట్టలేదు. కూటమి అధికారంలోకి రాగానే తొలిసంతకం దాని మీదే అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం స్టేజీ మీదే ఆ సంతకం చేస్తారని అంతా అనుకున్నారు. ఐతే అలా జరగలేదు.
కూటమి అధికారంలోకి వస్తే.. మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ ఫైలుపై తొలి సంతకం పెడతానని చంద్రబాబు అన్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెడతానని చెప్పారు. ఐతే ఇవేవీ ఇంకా జరగలేదు. దీంతో ఆయన రెండు సంతకాలు బాకీ పడినట్లు అయిందని.. సోషల్ మీడియాలో వైసీపీ చర్చ మొదలుపెట్టింది. ఐతే ప్రస్తుతం గత సర్కార్ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఇంకా పెండింగ్‌లో ఉంది. అప్లికేషన్లు తీసుకున్నారు కానీ.. ఎగ్జామ్ పెట్టలేదు. ఆ పని పూర్తయ్యాక మెగా డీఎస్సీ సంగతి చూస్తారేమో అని మరికొందరు అంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా హామీలే ఇచ్చారు. నిజానికి వాటన్నింటికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమే ప్రస్తుతం రెండు సంతకాలను హోల్డ్‌లో పెట్టారని మరికొందరు అంటున్నారు.
ఐతే వైసీపీ మాత్రం.. ఈ తొలి సంతకంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టింది. టీడీపీ శ్రేణులు కూడా తగ్గేదే లే అంటున్నాయ్. తొలి సంతకం అంటే.. ప్రమాణస్వీకారం వేదిక మీదే చేయాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు మాటిచ్చారంటే.. నెరవేరుస్తారని.. డీఎస్పీ సంతకానికి పవన్‌ది హామీ అంటూ.. కౌంటర్ ఇస్తున్నారు. ఏమైనా చంద్రబాబు (Chandrababu) కు అనుకున్నంత ఈజీగా అయితే పరిస్థితులు లేవు. హామీల అమలు, సంతకాలు.. చంద్రబాబు వీటిని ఎలా ఎదుర్కొంటారు.. ఏం చేయబోతున్నారని ఆసక్తికరంగా మారింది.