Kodali Nani Ragging : రా… చంద్రబాబు బూట్లు తుడువ్.. కొడాలి నానిపై ట్రోలింగ్ మామూలుగా లేదు
ఏపీలో వైసీపీ (YCP) ఘోరంగా దెబ్బతినడంతో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు... చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan) ని ప్రతి రోజూ బూతులు తిట్టిన నోటి దూల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది.

After the YCP suffered a severe defeat in AP, the coalition government came to power.
ఏపీలో వైసీపీ (YCP) ఘోరంగా దెబ్బతినడంతో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు… చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan) ని ప్రతి రోజూ బూతులు తిట్టిన నోటి దూల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది. పార్టీలు అన్నాక విమర్శలు చేసుకోవడం మామూలే అయినా… వైసీపీ లీడర్లు, మంత్రులు మాత్రం తమ స్థాయిని దిగజార్చుకున్నారు. అపోజిషన్ లీడర్లపై వ్యక్తిగత విమర్శలు… అమ్మ నా బూతులు తిడుతూ చెలరేగి పోయారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా లాంటి లీడర్లయితే మితిమీరి ప్రవర్తించారు. అందుకే ప్రభుత్వం మారగానే తెలుగుదేశం పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఆవేశం తట్టుకోలేక… కొడాలి నాని, వంశీ, అనిల్ యాదవ్ ఇళ్ళపై కోడిగుడ్లతో దాడి చేశారు.
జగన్ పేరుతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే కొడాలి నాని గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… చంద్రబాబు కుప్పంలో ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా… ఆడి బూట్లు తుడుస్తా… బాబు కాళ్ళ దగ్గరే కూర్చుంటా… అంటూ చెలరేగిపోయాడు. ఇప్పుడు టీడీపీ లీడర్లు అదే వీడియోను షేర్ చేస్తూ… చంద్రబాబు గెలిచాడు… రా… బాబు బూట్లు తుడువ్… ఆయన కాళ్ల దగ్గర కూర్చో… మాటకు కట్టుబడి ఉండాలి అంటూ… సోషల్ మీడియాలో కొడాలి నానిని ట్రోల్ చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బాబు, పవన్, లోకేష్ ని నోరు తెరిస్తే బండబూతులు తిట్టిన కొడాలి నాని… ఈమధ్య తమ పార్టీ కార్యకర్తలపై దాడుల విషయంలో చాలా సౌమ్యంగా మాట్లాడారు. పోలీసులు స్పందించట్లేదు. మేం ఆందోళన చేస్తాం… కోర్టులో తేల్చుకుంటామని మాత్రమే అన్నారు. కానీ అప్పటి ఛాలెంజ్ లకు ఇప్పుడు కొడాలి నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఇక నెక్ట్స్ టార్గెట్ లో వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా లైన్లో ఉన్నారు.