Ambati Rayudu: వైసీపీకి షాక్.. అంబటి రాయుడు రాజీనామా.. పది రోజులకే..
వైసీపీకి మరో షాక్ తగిలింది. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.

Ambati Rayudu: తిరుగుబాట్లు, పార్టీ నేతల రాజీనామాలతో వరుసగా ఢీలా పడుతున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంబటి రాయుడు వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది.
AP Politics, Balakrishna : ఎంపీగా పోటీ చేయబోతున్న బాలయ్య..
ఆయన గత డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాగా.. అంబటి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించలేదు. కానీ, రాజకీయవర్గాల ప్రకారం.. ఆయనను గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ భావించినట్లు ప్రచారం జరిగింది. కానీ, అంబటి మాత్రం నర్సరావుపేట సీటు ఆశించారు. ఆయనకు ఆ సీటు ఇవ్వడం లేదని వైసీపీ తెలిపింది. దీంతో అంబటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అంబటి రాజకీయాలపై ఆసక్తి చూపించారు. ముఖ్యంగా వైసీపీలో చేరాలని భావించారు. దీనికి అనుగుణంగా ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. తర్వాత వైసీపీలో చేరారు. అంతకుముందు వైసీపీకి, జగన్‌కు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు.
చివరకు ఆ పార్టీనే వీడాల్సి వచ్చింది. పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ ప్లేయర్.. త్వరగానే తన ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడేశాడు. అది కూడా కనీసం పోటీ చేయకుండానే పార్టీ నుంచి వైదొలిగి.. సంచలనంగా నిలిచారు. క్రికెట్‌లో కూడా ఇలాంటి దూకుడు మనస్తత్వంతోనే అంబటి అంతర్జాతీయ టోర్నీల్లో ఆడలేకపోయాడు. రంజీలు, ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు వైసీపీలో చేరి కూడా అలాంటి నిలకడలేని మనస్తత్వాన్ని చాటుకున్నాడు.