రక్తం మరుగుతుంది, వదలను: సజ్జల వార్నింగ్
టిడిపి కార్యాలయంపై దాడి పేరుతో అక్రమంగా కేసు పెట్టారు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారు అని మండిపడ్డారు.
టిడిపి కార్యాలయంపై దాడి పేరుతో అక్రమంగా కేసు పెట్టారు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారు అని మండిపడ్డారు. నీచమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 120, 130 మంది ఉన్నారంటూ పెంచుకుంటూ పోతున్నారని… నేను లేనన్న సంగతి వారికి తెలుసన్నారు సజ్జల. 120 నిందితుడిగా నా పేరు చేర్చారని ఆయన ఆరోపించారు.
స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా కేసులు పెడుతున్నారన్నారు. వైసిపి కార్యకర్తలు, నేతల్లో పట్టుదల పెరుగుతుందని విషసంస్కృతి మొదలు పెట్టారని మండిపడ్డారు. విచారణ లేకుండానే ఎఫ్ ఐ ఆర్ లో ఎవరో వాంగ్మూలం ఇచ్చారని పేర్లు నమోదు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న భావిస్తే అది సాధ్యం కాదని హెచ్చరించారు. పట్టాభి ప్లాన్ తో నే తప్పుడు మాటలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. దాంతో రక్తమరుగుతుందని కుట్ర తోనే పట్టాభి తప్పుడు మాట మాట్లాడాడని విమర్శించారు. ఆవేశంతో దాడి చేసి ఉండొచ్చన్నారు.
నేను లేను అని చెప్పిన ఎందుకు సెన్సేషన్ చేస్తున్నారని ప్రశ్నించారు. వైసిపిని లేకుండా చేయాలని చేస్తున్నారని ఆరోపించారు. కథలు రాస్తున్నారు… ప్రొసిజర్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలని సూచించారు. నేను కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులు రాసుకున్నారని నేను ఏదో చేయాలని చెప్పానంటా… అప్పిరెడ్డి తో చెప్పానంటా…ఇదంతా కథలా లేదా అని ప్రశ్నించారు. ఈ కేసును పొడిగించాలనే సిఐడికి అప్పగించారన్నారు. ఎల్ వొసి ఇవ్వడంపై కోర్టుకు వెళతాం అని స్పష్టం చేసారు.