వర్మ బిజీ రాడు: ఆర్జీవి లాయర్
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు షాక్ ఇచ్చారు. వర్మపై ఈసారి ఉత్తరాంధ్రలో కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు కేసు నమోదు చేసారు.

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు షాక్ ఇచ్చారు. వర్మపై ఈసారి ఉత్తరాంధ్రలో కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు కేసు నమోదు చేసారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పోలీసులు ఆయన ఓ కేసు ఫైల్ చేసారు. రాంగోపాల్ వర్మ కు రావికమతం పోలీసుల నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు.
వారం రోజుల గడువు కోరుతూ న్యాయవాదిని పంపించారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి తరపు న్యాయవాది బుల్లి దొర మాట్లాడుతూ… షెడ్యూల్ బిజీ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారన్నారు. వారం రోజుల గడువు కోరుతూ నాతో లేఖ పంపించారని తెలిపారు.