Srisailam : శ్రీశైలంలో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివలింగం..
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో సాయంతో తవ్వకాలు.. చదును చేస్తుండగా శివలింగం బయటపడింది.

Ancient Shivalinga unearthed in excavations in Srisailam..
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో సాయంతో తవ్వకాలు.. చదును చేస్తుండగా శివలింగం బయటపడింది. పరిసరాలను చదును చేస్తుండగా.. లింగంతో పాటు నంది విగ్రహం పురాతన ఓ శివలింగం వెలుగులోకి వచ్చింది.. ఆ శివలింగం అర్థం కానీ లిపితో శాసనం గుర్తులు రాసి ఉన్నాయి. తవ్వకాల్లో బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు.
ఇక ఆ శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు దేవస్థానం అధికారులు పంపించారు. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. శిలాశాసనం పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. చక్ర గుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్టించినట్లు లిపిలో నమోదు చేసి ఉంది. గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి. మళ్లీ అదే పరిశర ప్రాంతాల్లో అదే రీతిలో పురాతన శివలింగం బయటపడటం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.