TDP-JANASENA: సంచలనం రేపుతోన్న కొత్త సర్వే.. ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు..

సింగిల్‌గా పోటీ చేస్తున్న వైసీపీకి.. పొత్తుగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు బయటపెట్టింది. ఈ సంస్థ గతంలో.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 03:02 PMLast Updated on: Jan 10, 2024 | 3:02 PM

Andhra Pradesh Survey About Latest Results Of Ap Elections

TDP-JANASENA: ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే.. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయ్. అదేదో అప్పుడే షెడ్యూల్ వచ్చేసింది అన్న రేంజ్‌లో.. రాజకీయ పార్టీలు దూకుడు చూపిస్తున్నాయ్. ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా పావులు కదుపుతున్నాయ్. అభ్యర్థులను తొలగిస్తూ.. స్థానాలను మారుస్తూ.. జగన్ నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకుపోవద్దు అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. జనసేనతో పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇక అటు కాంగ్రెస్‌ కూడా లక్ పరీక్షించుకునేందుకు సిద్ధం అయింది.

AMBATI RAYUDU: క్రికెట్‌లో.. రాజకీయాల్లో.. నిలకడలేని రాయుడు.. వాట్‌ ఈజ్ దిస్‌..?

షర్మిలను ముందు పెట్టి రాజకీయం నడిపించబోతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరిది.. ఏ పార్టీకి ఎంత సీన్ ఉంది.. ఎవరి బలం ఎంత అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఏపీ జనాల మూడ్‌పైన ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓ నివేదిక రిలీజ్ చేసింది స్కూల్ ఆఫ్‌ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ. ఏపీలో జనాల మూడ్‌ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. సింగిల్‌గా పోటీ చేస్తున్న వైసీపీకి.. పొత్తుగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు బయటపెట్టింది. ఈ సంస్థ గతంలో.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది. ఇప్పుడు ఏపీలో ఫలితాల పైన అంచనాలను ప్రకటించింది. ఏపీలో సీఎంగా జగన్‌కు మంచి ఆదరణ ఉన్నా.. టీడీపీ, జనసేన కూటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఎన్నికలకు మూడు నెలల ముందే జనాల అభిప్రాయం తెలుసుకుంటున్నామని.. గతంలోనూ ఇదే చేశామని సంస్థ వివరించింది.

ఏపీలో మూడు రీజియన్లుగా విభజించి.. అంచనాలను వెల్లడించింది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాల్లో వైసీపీకి 12 నుంచి 16 వరకు వస్తాయని.. టీడీపీ, జనసేన కూటమి 18 నుంచి 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో మొత్తం 85 స్థానాల్లో… వైసీపీకి 19 నుంచి 24 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 58 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రాయలసీమలోని మొత్తం 55స్థానాల్లో.. మెజార్టీ సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లడించింది. వైసీపీకి 36 నుంచి 40 సీట్లు.. టీడీపీ, జనసేన కూటమికి 14 నుంచి 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఓవరాల్‌గా వైసీపీకి 67 నుంచి 80 సీట్లు దక్కుతాయని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. టీడీపీ, జనసేన కూటమి 90 నుంచి 105 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. ఇది జస్ట్ అంచనా మాత్రమే. అదీ మూడు నెలల ముందు! గంటగంటకు మారిపోయే రాజకీయం ఉన్న రాష్ట్రం అది. ఎన్నికల నాటికి ఏ అద్భుతం జరిగినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది మరికొందరి వాదన.