Pawan Kalyan : త్వరలో పవన్ తో రేణూ దేశాయ్ భేటీ…? కారణం అదేనా…?
ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ వార్త వచ్చినా సరే జనాల్లో ఉండే ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లి తెరపై ఆమె ఈ మధ్య కాలంలో కాస్త సందడి చేస్తూ పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Any news about Renu Desai, the ex-wife of AP Deputy CM Pawan Kalyan, has little to say about the public's interest.
- అమరావతికి రేణు దేశాయ్…? పవన్ అపాయింట్మెంట్ అడిగారా…?
ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ వార్త వచ్చినా సరే జనాల్లో ఉండే ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లి తెరపై ఆమె ఈ మధ్య కాలంలో కాస్త సందడి చేస్తూ పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న రేణు మొన్నా మధ్య రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సైతం జరిగింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసి పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆమెపై కొన్ని కామెంట్స్ కూడా చేసారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఆమె రెండో వివాహానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు మరి. అయితే తన కొడుకుని హీరోని చేయాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే ప్రచారం అయితే చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ సైతం అకీరాను ఒక యాక్టింగ్ స్కూల్ లో కూడా జాయిన్ చేస్తున్నారని, దానికి రేణు దేశాయ్ కూడా అంగీకారం తెలిపారని సోషల్ మీడియా జనాలు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు రేణు… గత కొన్నాళ్ళుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు.
భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న రేణు, ఒక యూనివర్సిటీని ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె తెలంగాణా దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యారు. తన మనసులో ఉన్న ఆలోచనను ఆమెకు వివరించగా… కొండా సురేఖ సైతం సానుకూలంగా స్పందించారని, సమయం చూసుకుని రేవంత్ రెడ్డి తో కూడా భేటీ కానున్నారని వార్తలు వస్తున్నాయి.
అలాగే ఏపీ మీద కూడా దృష్టి పెట్టిన ఈ మాజీ హీరోయిన్… త్వరలోనే ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కూడా భేటీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అనంతరం డిప్యూటి సిఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులో ఉన్న యూనివర్సిటీ ఆలోచన ఆయనకు వివరించి, పవన్ తో కలిసి సిఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలని చూస్తున్నారట. విశాఖ లేదా అమరావతి పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచనలో ఆమె ఉన్నారని సినీ వర్గాలు అంటున్నాయి. పవన్ తో విడిపోయిన తర్వాత ఇప్పుడు భేటీ అయితే మాత్రం అధికారికంగా ఇది మొదటి సమావేశం కానుంది. ఈ భేటీ కోసం సినీ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది చూడాలి.