AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం… మెగా డీఎస్పీకు మంత్రివర్గం ఆమోదం..

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం... సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు హాజరయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 24, 2024 | 01:00 PMLast Updated on: Jun 24, 2024 | 1:00 PM

Ap Cabinet Meeting Begins Mega Dsc Cabinet Approves

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం… సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు హాజరయ్యారు. ఇటీవల సీఎం చేసిన ఐదు సంతకాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఈ సమావేశంలో పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌ పై చర్చలు జరిగినట్లు సమాచారం..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం…

ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెగా డీఎస్పీ ప్రక్రియకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించారు. జూలై 1 నుంచి పక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. టెట్ నిర్వహణ, టెట్ లేకుండానే డీఎస్సీపై రెండు రకాల ప్రతిపాధనలను చర్చించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే.

వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై భేటీ…

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. 8అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పయ్యావుల కేశవ్, అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ తదితరులతో క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.