AP CM : రేపు హైదరాబాద్ కు ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ ను పరామర్శించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తొలి సారిగా కలవబోతున్నారు ఏపీ సీఎం జగన్. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల రేపు ఆ పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను కలిసి పరామర్శిస్తారు. ఇటీవల అనుకోని సంఘటనల కారణంగా కేసీఆర్ ఎడమతుంటికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఆయనను పరామర్శించనున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం తర్వాత జగన్ నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తొలి సారిగా కలవబోతున్నారు ఏపీ సీఎం జగన్. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల రేపు ఆ పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తో సహా పలువురు రాజకీయ ముఖ్య నేతలు, కూడా కేసీఆర్ ను కలిసి పరామర్శించారు.