CM Jagan : స్టైలిష్ లుక్‌లో సీఎం జగన్..
ఏపీ సీఎం జగన్ (CM Jagan) లండర్ పర్యటన ముగిసింది. ఇవాళే ఆయన తన ఫ్యామిలీలో కలిసి ఇండియాకు తిరగివచ్చారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Election Polling) పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు.

AP CM Jagan's visit to Lunder is over.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) లండర్ పర్యటన ముగిసింది. ఇవాళే ఆయన తన ఫ్యామిలీలో కలిసి ఇండియాకు తిరగివచ్చారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Election Polling) పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశీ పర్యటనలో (Jagan’s foreign tour) ఉన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి వచ్చారు.
విదేశీ పర్యటనను పూర్తిచేసుకుని.. ఇవాళే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ దిగారు. అయితే జగన్ లండన్ టూర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు ఫార్మల్ లుక్‌లో కనిపించే జగన్ ఈ ఫొటోల్లో మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపించారు. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దాదాపుగా జగన్ వైట్ షర్ట్‌లోనే ఉంటున్నారు.
వ్యక్తిగత ఫంక్షన్స్‌కు వెళ్లినా కూడా అదే వైట్ షర్ట్ ఫార్మల్ ప్యాంట్‌లోనే వెళ్తారు. చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. కానీ ఈ టూర్‌లో మాత్రం చాలా ట్రెండీ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక మిస్టర్ కూల్ అంటూ.. సూపర్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానలు షేర్ చేస్తున్నారు.