Botsa Satyanarayana : మంత్రి బొత్సకు టిక్కెట్ లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ ఈసారి చెక్ పెడుతున్నారా ? ఇక ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే.. అవును.. ఆయన కుటుంబ సభ్యులతోనే సత్తిబాబు పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ 3వ జాబితా వెల్లడైతే ఈ అనుమానాల పటాపంచలు అవుతాయని అంటున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తనకే ప్రాధాన్యత ఇస్తున్నారని భ్రమపడుతున్న బొత్స.. ఇక ఇంటికే పరిమితం అవుతానని తెలుసులేకపోతున్నారని అనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 11:48 AMLast Updated on: Jan 10, 2024 | 11:48 AM

Ap Education Minister Botsa Satyanarayana Has No Ticket

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ ఈసారి చెక్ పెడుతున్నారా ? ఇక ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే.. అవును.. ఆయన కుటుంబ సభ్యులతోనే సత్తిబాబు పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ 3వ జాబితా వెల్లడైతే ఈ అనుమానాల పటాపంచలు అవుతాయని అంటున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తనకే ప్రాధాన్యత ఇస్తున్నారని భ్రమపడుతున్న బొత్స.. ఇక ఇంటికే పరిమితం అవుతానని తెలుసులేకపోతున్నారని అనిపిస్తోంది.

ప్రస్తుతం బొత్స సత్యనారాయణకు ప్రభుత్వంలో.. వైసీపీ పార్టీలో ఫుల్లుగా ప్రియారిటీ ఉంది. వైసీపీ అభ్యర్థుల జాబితాను బొత్సయే మీడియాకు చదివి వినిపిస్తున్నారు. ఏపీలో సమ్మె చేస్తున్న ఉద్యోగులతో కూడా ఆయనే చర్చలు జరుపుతున్నారు. ఏంటీ.. సత్తిబాబుకి ఇంత ప్రాధాన్యత ఎందుకు.. దీని వెనుక ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు బొత్స అభిమానుల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం బొత్స చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి అక్కడి నుంచి టికెట్ ఇవ్వట్లేదనే ప్రచారం నడుస్తోంది. వాళ్ళ కుటుంబం నుంచి.. విశాఖ లోక్ సభ స్థానాన్ని బొత్స భార్య ఝాన్సీ లక్ష్మికి కేటాయిస్తారని లీకులు వదులుతోంది వైసీపీ. ఇదే విషయం మీడియా అడిగితే.. అవునా.. నాకు తెలియదే.. నాతో జగన్ ఎప్పుడూ మాట్లాడలేదే.. అని అమాయకంగా జవాబు చెప్పారు సత్తిబాబు. కానీ చీపురుపల్లి టిక్కెట్ తనకు ఇవ్వట్లేదనీ.. ఆయన భార్య ఝాన్సీకి విశాఖ ఎంపీ సీటు సంగతి కూడా బొత్సకు జగన్ ఎప్పుడో చెప్పారని అంటున్నారు.

బొత్సకు ప్రస్తుతం దక్కుతున్న ప్రియారిటీని బట్టి.. ఆయనకు టిక్కెట్ ఇవ్వట్లేదని ఎందుకు చెబుతున్నారంటే.. గతంలో ధర్మాన పరిస్థితి కూడా అంతే అయింది. 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన ఛాన్స్ ఆయనకే అప్పగించారు జగన్. దాంతో ధర్మాన తనకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉందనీ.. ఇక తిరుగు లేదని భావించారు. ఎన్నికల్లో గెలిస్తే.. మంత్రి పదవిలో కూర్చుంటానని కలలుగన్నారు. పైగా మంచి కీలకమైన పోర్టు పోలియోనే జగన్ ఇస్తారని కూడా అనుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. మూడేళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నారు. మంత్రి పదవి రాదని బెంగపెట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలు కలిసిరావడంతో.. ఎలాగొలా ధర్మానకు మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు బొత్స విషయంలోనూ సేమ్ టు సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయని వైసీపీ లీడర్లలో చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. బొత్స కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చారు. చీపురుపల్లి ఎమ్మెల్యేగా బొత్సా, గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్య, ఆయన దగ్గరి బంధువు అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే. ఇప్పుడు సత్తిబాబు మేనల్లుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్. ఆ జిల్లా అంతటా బొత్సా కుటుంబందే హవా. మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా బొత్స అనుచరులే. అందుకే సత్తిబాబును ఆయన మేనల్లుడు చిన్న శ్రీను ద్వారా తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. శ్రీనుకే విజయనగరం ఎంపీ టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. బొత్సకు నీకు.. రాజ్యసభ సీటు ఇస్తాంలే అని చెప్పి.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇదంతా బొత్స సత్యనారాయణకు తెలిసే జరుగుతుందా.. చీపురుపల్లి టిక్కెట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నది వైసీపీ థర్డ్ లిస్ట్ లో తేలనుంది.