AP Elections Bettings : ఏపీలో ఆగిన బెట్టింగ్స్…. జగన్ కాన్ఫిడెన్స్ తో భయం?
ఆంధ్రప్రదేశ్ లో నెక్ట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తే ఎన్ని సీట్లు ? ఎవరెవరికి ఎంత మెజారిటీ ? ఇలా రకరకాల అంశాలపై గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ బెట్టింగ్స్ ఆగిపోయాయి. ఎందుకంటే...
ఆంధ్రప్రదేశ్ లో నెక్ట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తే ఎన్ని సీట్లు ? ఎవరెవరికి ఎంత మెజారిటీ ? ఇలా రకరకాల అంశాలపై గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. వైసీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొందరు… కాదు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే ప్రభుత్వం అని మరికొందరు… ఇలా పందేలు జోరుగా సాగాయి. 1కి 5 రేషియోలో పందేలు కాశారు. బెట్టింగ్ రాయుళ్ళు సిండికేట్ గా మారి కోట్లల్లో పందేలు కాశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ పందేల జోరుగా తీవ్రంగా కనిపించింది. ఉండి, కడప జిల్లాలోని అబ్యర్థులు, స్థానలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో మెజార్టీలపై భారీ ఎత్తున బెట్టింగ్స్ నడిచాయి.
కానీ గత రెండు రోజులుగా ఈ బెట్టింగ్స్ కి అనూహ్యంగా బ్రేక్ పడింది. అందుక్కారణం… అసెంబ్లీ ఎన్నికల్లో తాము 152 సీట్లు సాధిస్తామని సీఎం జగన్ ధీమగా చెప్పడమే. ఐప్యాక్ టీమ్ తో జరిగిన సమావేశంలో జగన్ మళ్ళీ తామే అధికారంలోకి వస్తున్నామని క్లియర్ కట్ గా చెప్పారు. ఆయన అంచనాలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ… జగన్ కాన్ఫిడెన్స్, విజయంపై ధీమా చూసి బెట్టింగ్స్ పై కట్టాలంటే పంటర్స్ భయపడుతున్నారు. జగన్ అంత నమ్మకంగా ఎలా చెప్పారని రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటి దాకా కూటమి విజయంపై భారీగా బెట్టింగులు కొనసాగాయి. ఎన్ని సీట్లు మెజారిటీ వస్తుంది… ప్రముఖుల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది… లాంటి అంశాలపై పందేలు కట్టారు. కానీ జగన్ కాన్ఫిడెన్స్ చూశాక… పంటర్స్ లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికి పందేలు బంద్ చేసి… కొన్నిరోజులు వెయిట్ చేద్దామన్న ఆలోచనలో పడ్డారు. దాంతో రెండు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ బెట్టింగ్స్ నిలిచిపోయినట్టు చెబుతున్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా ఉండటంతో… అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అని దానిపై రాష్ట్రమంతా చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనం భారీగా ఓట్లేశారని కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ అభివృద్ధి పథకాలను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశ్యంతో వైసీపీకి ఓట్లేశారని ఆ పార్టీ నేతలు ధీమాగా అంటున్నారు.