AP Exit Polls : ఏపీ ఎగ్జిట్‌పోల్స్.. ఎలా ఉంటాయ్.. ఎవరికి ఫేవర్ అంటే…
ఏపీ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయ్. కలిసిన పార్టీలు.. పెరిగిన పోలింగ్ (AP Polling).. ఎన్నికల ఫలితాల మీద మరింత ఆసక్తి పెంచాయ్. చివరి విడత ఎన్నికలు ముగిసిన ఓ అరగంట తర్వాత.. ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో సాయంత్రం ఆరున్నర ఎప్పుడు అవుతుందా అని జనాలంతా ఎదురుచూస్తున్నారు.

AP elections have become more interesting this time..Exit polls soon..
ఏపీ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయ్. కలిసిన పార్టీలు.. పెరిగిన పోలింగ్ (AP Polling).. ఎన్నికల ఫలితాల మీద మరింత ఆసక్తి పెంచాయ్. చివరి విడత ఎన్నికలు ముగిసిన ఓ అరగంట తర్వాత.. ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో సాయంత్రం ఆరున్నర ఎప్పుడు అవుతుందా అని జనాలంతా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్… తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయ్.
దీనికి రెండు కారణాలు ఉన్నాయ్. ఒకటి.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) సంబంధించి ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వస్తాయ్. వాటిలో వైసీపీ (YCP) మళ్లీ గెలుస్తుందా లేక కూటమికి ఛాన్స్ ఇచ్చాయా అనేది ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్. అటు తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై జనాలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది మరో అంశం. దీంతో ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. 543 స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ 272గా ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఏపీ అసెంబ్లీలో 88 మ్యాజిక్ మార్కుగా ఉంది. 2019లో వైసీపీ (YCP) 151, టీడీపీ (TDP) 23, జనసేన (Jana Sena) 1 సీటు గెలుచుకున్నాయ్. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా.. వాటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు.
ఈ పోల్స్ నిర్వహించే సంస్థలు కూడా.. కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాయని కొందరి వాదన. అందుకే ఫలితాలను ఎలా నమ్మగలం అన్నది వాళ్ల ప్రశ్న. ఇదంతా ఎలా ఉన్నా.. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చే ఫలితాలు.. ప్రతిసారీ నిజమైన ఫలితాలకు దగ్గరగా ఉండాలన్న గ్యారంటీ లేదు. 2019లో వైసీపీకి 151 సీట్లు వస్తాయని ఏ సంస్థా అంచనా వేయలేకపోయింది. దీంతో జనాలు నిజంగా ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదు. అసలైన ఫలితాలు వచ్చినప్పుడే నిజం తెలుస్తుంది.