Anganwadis: అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం.. అయినా తగ్గేది లేదంటున్న కార్యకర్తలు

విధులకు దూరంగా, 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మెలోనే ఉంటున్నారు. దీంతో ఏపీలో వీరి సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారితో పలు ఫదఫాలుగా చర్చలు జరిపింది. కానీ, ప్రభుత్వం నుంచి అంగన్‌వాడీలకు సరైన హామీ, పరిష్కారం లభించలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 03:49 PMLast Updated on: Jan 06, 2024 | 3:49 PM

Ap Government Enforces Esma On Anganwadis Not Caring By Anganwadi Workers

Anganwadis: తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంతేకాకుండా అంగన్‌వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ జీవో నంబరు2 జారీ చేసింది. దీని ప్రకారం.. ఆరు నెలల పాటు నిరసనలు, సమ్మెలు చేయడంపై నిషేధం విధించింది. జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు, తమ ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. విధులకు దూరంగా, 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మెలోనే ఉంటున్నారు.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

దీంతో ఏపీలో వీరి సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారితో పలు ఫదఫాలుగా చర్చలు జరిపింది. కానీ, ప్రభుత్వం నుంచి అంగన్‌వాడీలకు సరైన హామీ, పరిష్కారం లభించలేదు. వాళ్ల డిమాండ్లు నెరవేర్చడం వల్ల ఆర్థికంగా భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపై కూడా హామీ ఇవ్వలేదు. కొన్ని డిమాండ్లకు మాత్రమే అంగీకరించింది. దీంతో అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరినప్పటికీ అంగన్‌వాడీలు వెనకడుగు వేయలేదు. దీంతో తాజాగా ఎస్మా ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకుంది. సమ్మె కాలానికి సంబంధించి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాల్లో కోత పెట్టింది. దాదాపు మూడు వేల వరకు తగ్గించి, వారి అకౌంట్లలో డబ్బు జమ చేసింది. ఎస్మా ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఉద్యోగులు ఎవరైనా సమ్మెలు చేస్తే, వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

అవసరమైతే ఉద్యోగుల్ని తొలగించవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు కూడా పెట్టవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు, సహకరించిన వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఎస్మాపై ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. వెంటనే అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని సూచించింది. సమ్మె వల్ల రాష్ట్రంలోని గర్భిణులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, విధుల్లో చేరకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ, అంగన్‌వాడీలు వెనకడుగు వేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని, ప్రభుత్వం స్పందించకుంటే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగులు హెచ్చరించారు.