కోట్ల రూపాయల భూమి…. ఎవడబ్బ సొత్తు?
ఎట్టకేలకు ఏపీ సర్కార్ దొంగ స్వామి విశాఖ స్వరూపానంద తిక్క కుదిర్చింది. విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 220 కోట్ల రూపాయలు విలువైన 15 ఎకరాల భూమిని కేవలం 15 లక్షల కే విశాఖ శారదా పీఠం కొట్టేసింది.
ఎట్టకేలకు ఏపీ సర్కార్ దొంగ స్వామి విశాఖ స్వరూపానంద తిక్క కుదిర్చింది. విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 220 కోట్ల రూపాయలు విలువైన 15 ఎకరాల భూమిని కేవలం 15 లక్షల కే విశాఖ శారదా పీఠం కొట్టేసింది. హైదరాబాదులో కూడా స్వరూపానంద కొట్టేసిన కోట్ల రూపాయల విలువైన రెండు ఎకరాలు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
స్వయం ప్రకటిత పీఠాధిపతి, విశాఖ స్వరూపానందేంద్ర స్వామి అప్పట్లో జగన్ సర్కారును అదుపులో పెట్టుకొని భీమిలిలో 15 ఎకరాల భూమిని అతి తక్కువ రేటు కి కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి సర్కారు దర్యాప్తు చేపట్టింది. ఇప్పుడు నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను రద్దు చేసింది. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్వరూపానందేంద్ర స్వామి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. క్రిస్టియన్ అయిన జగన్ మోహన్ రెడ్డికి హిందూ మత కలర్ ఇవ్వడంలో భాగంగా… స్వరూపానంద రంగ ప్రవేశం చేశారు. ఎనిమిదవ శతాబ్దం నాటి శృంగేరి శారదాపీఠం పేరును కొట్టేసి ఆ పేరు పై విశాఖలో స్వయం ప్రకటిత పీఠాన్ని ఏర్పాటుచేసిన స్వరూపానందేంద్ర కి జగన్ సర్కార్ మొదట విశాఖలోని తగరపువలసలో 15 ఎకరాలు కేటాయించింది. కానీ తనకు భీమిలి లోనే స్థలం కావాలని పట్టుబట్టి 15 ఎకరాలు రాబట్టాడు దొంగ స్వామి. దీనికి కారణం భీమిలిలో 20 ఏళ్ల క్రితమే స్వరూపానందేంద్ర కు ప్రత్యర్థి అయిన చిన్న జీయర్ కు అక్కడ ఐదు ఎకరాల్లో ఆశ్రమం ఉంది. చిన్న జీయర్ కు పోటీగా అదే ప్రాంతంలో 15 ఎకరాల భూమిని కైవసం చేసుకున్నాడు స్వరూపానందేంద్ర స్వామి. దీని విలువ మార్కెట్ రేట్ లో 250 కోట్లకు పైనే ఉంటుంది.
ఇక్కడ అల్ట్రా మోడ్రన్ ఆశ్రమం కట్టాలనేది స్వామి వారి ప్లాన్. దీనిపై చాలా అభ్యంతరాలు రావడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమతిని రద్దు చేసింది. తిరుమల కొండపై కూడా ఆశ్రమానికి స్థలం దక్కించుకున్న స్వామీజీ
అక్కడ ఐదు ఫ్లోర్లు వేయడానికి అక్రమంగా అనుమతులు కూడా పొందాడు. వాటిని కూడా టీటీడీ త్వరలో రద్దు చేయబోతోంది. హైదరాబాద్ కోకాపేట్ లో కెసిఆర్ హయాంలో రెండు ఎకరాల భూమిని కేవలం రెండు రూపాయలకి కొట్టేశాడు స్వరూపా నంద. ఆ భూమిలో ముందు జాగ్రత్తగా చిన్నచిన్న నిర్మాణాలు కూడా చేశాడు. ఇప్పుడు ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని, 200 కోట్లు విలువ చేసే కోకాపేట భూమిని రెండు రూపాయలకి స్వామికి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రజా సంఘాల ప్రశ్నిస్తున్నాయి. విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్రకు అత్యంత సన్నిహితుడైన సాహితీ ఇన్ఫ్రా ఎండి బూదాటి లక్ష్మీనారాయణ ను కొద్దిరోజుల క్రితమే ఈడీ అరెస్ట్ చేసింది.
ఫ్రీ లాంచ్ పేరుతో హైదరాబాదులో వందల మంది నుంచి వేలకోట్ల రూపాయలు వసూలు చేసి…. పరారీ అయిపోయాడు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణకు స్వరూపానంద స్వయంగా రెకమెండ్ చేసి టీటీడీ బోర్డులో మెంబర్గా నామినేటెడ్ పోస్ట్ వేయించాడు. ఆ తర్వాత ఈడిని , సి.బి.ఐ ని తప్పించుకోవడానికి తిరుమల కొండపై ఉన్న స్వరూపానంద ఆశ్రమంలోనే బూదాటి లక్ష్మీనారాయణ తలదాచుకున్నాడని సమాచారం వచ్చింది. మొత్తం మీద ఇటీవలే సాహితి ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ ను ఈడి అరెస్టు చేసింది. పొలిటీషియన్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, భూ కబ్జా దారులతో కలిసి తిరిగే స్వరూపానందేంద్రకు జగన్ సర్కార్ ఇచ్చిన సెక్యూరిటీని కూడా ఇటీవలే చంద్రబాబు సర్కార్ తీసేసింది. 2019లో ఎమ్మెల్యే టికెట్లు , మంత్రి పదవులు ఇప్పించడానికి స్వరూపానంద కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలోనూ కేసీఆర్ హయాంలో యాగాలు యజ్ఞాలు పేరిట స్వరూపానంద చక్రం తిప్పాడు. ఇప్పుడు జనం నుంచి, ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఆరోపణలను, ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన 15 ఎకరాల భూమిని కూడా వెనక్కి తీసుకుంది ఏపీ సర్కార్. ఇక హైదరాబాదులో ఇచ్చిన రెండు ఎకరాల భూమిని కూడా స్వరూపానందేంద్ర కబంధహస్తాల నుంచి తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకోవడమే మిగిలింది.