Nara Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ ఉపశమనం.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్..

చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సహా ఐఆర్ఆర్, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుకకు సంబంధించి పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 03:41 PMLast Updated on: Jan 10, 2024 | 3:41 PM

Ap High Court Granted Anticipatory Bail To Chandrababu In All Cases

Nara Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల్లో మూడింట్లో ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సహా ఐఆర్ఆర్, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుకకు సంబంధించి పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

AMBATI RAYUDU: క్రికెట్‌లో.. రాజకీయాల్లో.. నిలకడలేని రాయుడు.. వాట్‌ ఈజ్ దిస్‌..?

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు కోర్టు తన తీర్పు వెల్లడించింది. జస్టిస్ టి.మల్లికార్జున రావు ఆధ్వర్యంలోని బెంచ్ ఉత్తర్వులు జార చేశారు. దీని ప్రకారం.. ఆయనకు ఐఆర్ఆర్, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే దర్యాప్తును ప్రభావితం చేసేలా చేయొద్దని ఆదేశించింది. ఒకేసారి మూడు కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. చంద్రబాబుతోపాటు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు కూడా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్ధార్థ లూథ్ర.. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు.. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గతంలోనే హైకోర్టు విచారణ జరిపి తిరస్కరించింది.

కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీనిపై చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున విచారణ జరగడం లేదు. కానీ ఆ కేసులో అరెస్టులు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది.