AP Polling : రిజల్ట్స్ రోజు ఏపీ రగిలిపోబోతోంది.. ఇంటెలిజెన్స్ సంచలన రిపోర్ట్
ఏపీలో పోలింగ్ వేళ జరిగిన అల్లరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రోజుల పాటు ఏపీలో జరిగిన అల్లర్లతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది.
ఏపీలో పోలింగ్ వేళ జరిగిన అల్లరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రోజుల పాటు ఏపీలో జరిగిన అల్లర్లతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. ఓ ఫ్యాక్షన్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ, వైసీపీ వేసిన వీరంగం ప్రతీ ఒక్కరినీ వణికించింది. ఏపీ ఎన్నికల సమయంలో అక్కడా ఇక్కడా చిన్న చిన్న అల్లర్లు జరగడం సహజం. అలాంటి అల్లర్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ఈసారి ఏపీలో కనిపించిన సీన్ మాత్రం నెవర్ బిఫోర్.
ఏకంగా నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌ను, డీజీపీని ఢిల్లీ పిలిచి మరీ క్లాస్ పీకింది. ఒక రాష్ట్ర సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లి మరీ వివరణ ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలాంటి నేపథ్యంలో జూన్ 4న.. అంటే ఎన్నికల ఫలితాల రోజున ఏపీలో ఇంతకు మించి విధ్వంసం జరగబోతోంది అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎలక్షన్ రిజల్ట్ రోజు ప్రతీకార చర్యలకు పాల్పడేందు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు.
దీంతో రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి విధ్వంసం జగరకుండా చూడాలని ఆదేశించింది. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు ముందు నుంచే చేసుకోవాలని సూచించింది. దీనికోసం ఏపీ ఫోర్స్ సరిపోకపోతే కేంద్రం నుంచి కూడా స్పెషల్ ఫోర్స్ పంపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పింది. అవసరమైతే సాయుధ బలగాలను కూడా రంగంలోకి దించండి అంటూ చెప్పింది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏం చేసైనా సరే ఏపీలో మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ అవకుండా చేయాలి అనేది అధికారులకు ఉన్న గట్టి ఆదేశం. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. రెండు పార్టీల నేతలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.