AP New Cabinet : ఏపీ నూతన మంత్రి వర్గం.. పవన్ కల్యాణ్ కు డీప్యూటీ సీఎంతో పాటుగా ఇన్ని శాఖల..?

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్​లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రత శాఖలను ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్​కు మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ శాఖలు ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2024 | 02:48 PMLast Updated on: Jun 14, 2024 | 2:51 PM

Ap New Cabinet Pawan Kalyan With Deputy Cm Along With So Many Departments

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ (TDP) – జనసేన (Jana Sena) – బీజేపీ (BJP) – కూటమి తరఫున రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కూడా దేశ ప్రధాని అధ్వర్యంలో జరిగిపోయింది. ఇదే కార్యక్రమంలో ఏపీ నూతన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి.. ఎవరు ఏ శాఖలో విధులు నిర్వహిస్తారు అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్​లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రత శాఖలను ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్​కు మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ శాఖలు ఇచ్చారు.

  • ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు..
  1. చంద్రబాబు నాయుడు ( సీఎం ) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు
  2. కొణిదెల పవన్ కళ్యాణ్ ( డిప్యూటీ సీఎం ) – పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ
  3. నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ
  4. వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ
  5. కింజరాపు అచ్చెన్నాయుడు – సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధక శాఖలు
  6. పయ్యావుల కేశవ్ – ఆర్థికశాఖ, శాసనభ వ్యవహారాలు
  7. కొల్లు రవీంద్ర – గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌
  8. నాదెండ్ల మనోహర్ – పౌరసరఫరాలశాఖ
  9. పి.నారాయణ – పట్టణాభివృద్ధి శాఖ
  10. సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ
  11. నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి శాఖ
  12. ఎన్.ఎమ్.డి.ఫరూక్ – మైనార్టీ, న్యాయశాఖ
  13. ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయశాఖ
  14. అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ
  15. కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, పౌరసంబంధాలశాఖ
  16. డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం
  17. గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్‌ శాఖ
  18. కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
  19. గుమ్మడి సంధ్యారాణి – గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ
  20. బీసీ జనార్థన్ రెడ్డి – రోడ్లు, భవంతుల శాఖ
  21. టీజీ భరత్ – పరిశ్రమలు
  22. ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం
  23. వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
  24. కొండపల్లి శ్రీనివాస్ – MSME, NRI సంబంధాలు
  25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా శాఖ, క్రీడా శాఖ

AP New Cabinet.. Pawan Kalyan with Deputy CM along with so many departments..?