Anakapally MP Seat : అనకాపల్లి చుట్టూ ఏపీ రాజకీయం !

175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది...? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది...? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్... ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 11:32 AMLast Updated on: Mar 18, 2024 | 11:32 AM

Ap Politics Around Anakapalli

 

 

175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది…? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది…? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్… ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది…? ఒక సీటు… పెద్ద పోటీ అనే స్థాయిలో మారుతున్న పరిణామాలు ఎక్కడ…? ఎందుకు అంత ప్రాధాన్యత…?.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 25 పార్లమెంట్ (Parliament) సీట్లకు ఎన్నికలు జరుగుతుంటే రాజకీయ పార్టీలు అనకాపల్లి (Anakapalli) మీద ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఎవరి అభ్యర్థిత్వం ఖరారు అవుతుంది…? ఎవరి నాయకత్వం నడిపిస్తుంది…? అనేది ఉత్కంఠగా మారింది.

దీనికి ప్రధాన కారణం ఈ సీటులో BJP తలపడటమే. పొత్తులో భాగంగా విశాఖ సీటును ఆశించింది కాషాయ పార్టీ. ఇక్కడ మూడేళ్ల నుంచి ప్రజలతో మమేకం అయ్యి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు (GVL Narasimha Rao) అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన ఆయన… పోటీకి సై అంటున్నారు. టిక్కెట్ ఆశించి ఇప్పటికే జాతీయ నాయకత్వం ఎదుట రాతపూర్వక అభ్యర్థన పెట్టారు GVL. కాషాయ పార్టీలో కాంపిటీషన్ పెరగ్గా మరో సీనియర్ నేత CM రమేష్ ఇక్కడే ఖర్చీఫ్ వేశారు. గతంలో గెలిచిన సీటు కావడంతో వైజాగ్ ఎంపీ స్థానంపై బీజెపీ అగ్రనాయకత్వం రాజీపడే ధోరణిలో ఉండదనే ప్రచారం జరిగింది. అయితే భాగస్వామ్య పక్షంగా ఇక్కడ టీడీపీ (TDP) కి ఈ స్థానం పదిలంగా ఉండటం అత్యవసరం.

2019 ఎన్నికల్లో కేవలం నాలుగు వేల స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన టీడీపీ… మరోసారి ఛాన్స్ తీసుకోవడానికి సిద్దంగా లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఇంచార్జీ, బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభారత్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో BJP సెకండ్ ఆప్షన్ గా అనకాపల్లి సీటును తీసుకునే ఆలోచన చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ అభ్యర్థిత్వం పై సందిగ్ధత కొనసాగుతోంది. కాషాయ దళం పోటీ అనివార్యం అనే సంకేతాలు పంపించేందుకు CM రమేష్ టీమ్ చేసిన హంగామా తీవ్ర చర్చ నేయాశంగా మారింది. అనకాపల్లి పార్ల మెంట్ పరిధిలో ఎలక్షన్ కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా పబ్లిక్ ప్లేసులో పెట్టిన ప్రచార సామగ్రిని యంత్రాంగం తొలగించింది. అయితే, అనకాపల్లి ఎంపీ సీటుపై తెలుగుదేశంలో పీఠముడి వుంది.

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ ఈ టిక్కెట్ కోసం అధిష్టానంతో పోరాడింది. తన కుమారుడు విజయ్ లేదా స్థానిక నేతకు కేటాయించాలని చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు అయ్యన్న. తలపోటు వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి మిత్ర పక్షమైన జనసేనకు ఈ సీటు ఇవ్వడం ద్వారా సమస్య జఠిలం కాకుండా జాగ్రత్త పడింది టీడీపీ అధిష్టానం. బీజెపీ ఎంట్రీ తర్వాత ఈక్వేషన్ లు మారిపోగా అనకాపల్లిలో కమలం పార్టీ సమాయత్తం అవుతోంది. వైజాగ్ నుంచి పోటీ చేయడమే తమ ఆలోచన అయితే కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఎక్కడి నుంచైనా బరిలోకి దిగడానికి సిద్ధమే అంటున్నారు బీజెపీ సీనియర్లు.

పొత్తుల కారణంగా భాగస్వామ్య పక్షాల సర్దుబాటు టీడీపీ నేతలకు చావు దెబ్బ కొట్టింది. ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జనసేనకు, ఒకటి బీజేపీకి వెళ్ళిపోయింది. అధికారికంగా ప్రకటించకపోయినా అనకాపల్లి ఎంపీ సీటు కాషాయం కోటాలో పడ్డం ఖాయమనే పరిస్థితులున్నాయి. దీంతో టీడీపీ సీనియర్ లు రగిలిపోతున్నారు. ప్రధానంగా వెలమ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా చేయగా…. మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి బల ప్రదర్శన చేపట్టి హైకమాండ్ కు అల్టిమేటం పంపించారు. సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడిన మరుక్షణం బండారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాలు అన్నీ అనకాపల్లి MP అభ్యర్థిత్వం ఖరారులో వైసీపీ కీలకంగా భావిస్తోంది. ఇక్కడ వెలమ నాయకత్వంలో టీడీపీ మీద పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం… CM రమేష్ (CM Ramesh) లేదా GVL లాంటి బలమైన నేతలు బరిలోకి దిగితే వాళ్ళను ఎదుర్కోవడం ప్రధానంగా వ్యూహాలు రచిస్తోంది. గవర సామాజిక వర్గంలోనూ మరోసారి ఛాన్స్ అనే ప్రచారం జరుగుతుండగా సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి ఆశలు సజీవంగా వున్నాయి. వెలమ అభ్యర్థిత్వం కూటమి ఖరారు చేస్తే అదే సామాజిక వర్గాన్ని పోటీ చేయించాలని వైసీపీ ఎత్తుగడ. వెలమ నేతగా CM రాజేష్ సీన్ లోకి వస్తే… డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడునీ తెరపైకి తెచ్చే ఛాన్స్ వుంది.

ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదన హైకమాండ్ పెట్టకపోవడంతో ముత్యాల నాయుడు మాడుగులలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. ఇక, TDP అసంతృప్తులు కదలికలు ఆసక్తిగా మారాయి. సీటు ఖరారు కాకపోతే బండారు టీడీపీకి గుడ్ బై కొట్టేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన నేతలకు అన్యాయం జరిగింది అనే ప్రచారం అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది అనే అభిప్రాయం బలంగా బీసీ సామాజిక వర్గాల్లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నీ తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు కృష్ణాజిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం. అటు బండారుతో కొందరు నేతలు టచ్ లోకి వెళ్లినట్టు తెలిసింది. దీంతో అన్ని స్థానాలకు టిక్కెట్లు ప్రకటించి అనకాపల్లి ఎంపీని పెండింగ్ లో పెట్టడం అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కు కారణం అయ్యింది. మొత్తం మీద అనకాపల్లి ఎంపీ సీటు హాట్ కేక్ అవ్వగా…..ఇక్కడ పోటీ BC అభ్యర్థిత్వం చుట్టూ తిరుగుతోంది.