Pawan Kalyan : పవన్ చెప్పులు మోసిన అన్నా లెజ్‌నోవా.. మరీ ఇంత ప్రేమా..
పవన్ క్రియేట్ చేసిన సునామీకి.. ఏపీ రాజకీయం షేక్ అయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేసిన తర్వాత... ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, శ్రేయోభిలాషుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్.
పవన్ క్రియేట్ చేసిన సునామీకి.. ఏపీ రాజకీయం షేక్ అయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేసిన తర్వాత… ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, శ్రేయోభిలాషుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్. ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. తన సతీమణి అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు పవన్. పూల వర్షం కురిపించి వారికి ఘన స్వాగతం పలికారు. చిరంజీవి కనిపించగానే, వెంటనే తన కాళ్లకున్న చెప్పులు విడిచి మోకాళ్ల మీద కూర్చొని… ఆయన కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో నాగబాబు కూడా చాలా ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. చిరంజీవితో పాటు తన తల్లి, వదినకు నమస్కరించే సమయంలోనూ పవన్ చెప్పులు చెప్పులు విడిచారు.
ఆ సమయంలో భర్త చెప్పుల్ని లెజినోవో తన చేతులతో తీసుకుని పక్కన నిలబడ్డారు. విదేశీ వనిత అయినా.. తన భర్త చెప్పులను తీసుకొని పట్టుకొని నిల్చోవడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది. ఆమె గొప్పతనానికి ప్రతీ ఒక్కరు ప్రశంసలు గుప్పిస్తున్నారు. రష్యా అమ్మాయి అయినా.. ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు. లెజినోవా చాలా లోప్రొఫైల్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటారు. చాలా తక్కువగా ఆమె బయటకు వస్తుంటారు. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి పవన్‌తో వచ్చిన లెజినోవా… ఫలితాలు వచ్చినప్పుడు భర్తకి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు.
ఇంటి దగ్గరికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనలో కూడా ఆమె ఉన్నారు. ప్రధాని మోదీతో సమావేశంలోనూ పాల్గొని సందడి చేశారు. చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన బావగారికి పాదాభివందనం చేశారు. అలానే ఉపాసనని ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులితో సరదాగా గడిపారు. ఐతే లెజినోవా, పవన్ విడిపోయారంటూ.. ఎన్నికల ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి అర్థం లేని కామెంట్లు చేసిన వారికి.. ఆ చేతిలో ఉన్న చెప్పులతోనే లెజినోవా ఆన్సర్ చెప్పారంటూ.. మరికొందరు కామెంట్ చేస్తున్నారు.