YS Sharmila : జగన్‌కు షర్మిల ఉసురు తగిలిందా ?

ఏపీ రాజకీయాలు ఈసారి.. కుటుంబాల్లో చిచ్చు పెట్టాయ్. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగితే.. అన్నాచెల్లెళ్లు జగన్‌, షర్మిల మధ్య నిప్పులు పుట్టించింది రాజకీయం. ఏ అన్నను గెలిపించాలని ఒకప్పుడు వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారో.. ఇప్పుడు అదే అన్నకు ఎదురు తిరిగారు షర్మిల.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 4, 2024 | 06:35 PMLast Updated on: Jun 04, 2024 | 6:35 PM

Ap Politics This Time Has Torn Families Apart If The Gap Between Konidela And Allu Families Increases

 

 

ఏపీ రాజకీయాలు ఈసారి.. కుటుంబాల్లో చిచ్చు పెట్టాయ్. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగితే.. అన్నాచెల్లెళ్లు జగన్‌, షర్మిల మధ్య నిప్పులు పుట్టించింది రాజకీయం. ఏ అన్నను గెలిపించాలని ఒకప్పుడు వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారో.. ఇప్పుడు అదే అన్నకు ఎదురు తిరిగారు షర్మిల. బాబాయ్ హత్య కేసుతో పాటు.. జగన్ రూపం ఇదీ అంటూ జనాల ముందుకు వచ్చారు. దీంతో వైఎస్ కుటుంబం వ్యవహారం రోడ్డునపడినట్లు అయింది. షర్మిలను చంద్రబాబు నడిపిస్తున్నారని.. ఆమె చీర రంగుతో పాటు మాటల వరకు.. ప్రతీ విషయాన్ని వైసీపీ ట్రోల్ చేసింది. దీంతో షర్మిల.. కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ మీద శాపనార్థాలు గుప్పించారు.

ఈ ఉసురే జగన్‌కు తగిలిందా అనే చర్చ జరుగుతోంది. అందుకే వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు చాలామంది. ఇది నిజమా కాదా అన్న సంగతి ఎలా ఉన్నా.. జగన్ అతి విశ్వాసమే వైసీపీని ఈ స్థాయిలో దెబ్బతీసింది. కూటమిని మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులను కూడా జగన్ తక్కువ చేసి చూశారేమో అనిపించింది ఓ సమయంలో. సొంత చెల్లెలు షర్మిలను కూడా చెడుగుడు ఆడుకున్నారు. దీంతో కన్నెర్ర చేసిన చెల్లెళ్లు.. జగన్‌ను ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యారు. అన్నపై తిరుగుబాటు బావుట ఎగరవేసి… వివేకా హత్య కేసు పదేపదే బయటకు తీసుకొచ్చి రాష్ట్రమంతా ఆ ప్రభావం పడేలా చేశారనే చర్చ జరుగుతోంది.

దీని ప్రభావమే బలం అనుకున్న రాయలసీమలో వైసీపీకి కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయ్. కంచుకోట లాంటి కడపలో కూడా.. వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. కుటుంబం నుంచి బయటికి వచ్చి.. జగన్ నట్టింట్లోకి ఓటమిని తీసుకువచ్చారు జగన్ చెల్లెళ్లు అనే అభిప్రయాలు వినిపిస్తున్నాయ్. సాధారణంగా ఏ చెల్లెళ్లు అయినా అన్న ఎదుగుదలను కోరుకుంటారు. ఐతే జగన్‌ చెల్లెళ్లు మాత్రం అన్న పరాభవాన్ని కోరుకున్నారు. విజయం సాధించారు. సొంత రక్త సంబంధీకులే వైసీపీపై తిరుగుబాటు చేయడంతో.. నట్టింట్లోకి ఓటమి నడిచి వచ్చినట్లు అయింది. కొందరు టీడీపీ నాయకులు, అభిమానులు అయితే.. మరో రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. జగన్‌కి తన సొంత చెల్లెళ్ల ఉసురు తగిలిందని, చేసిన పాపం ఎప్పటికైనా తగలక మానదని అంటున్నారు.