టికెట్ కొడుతున్నారు బాబూ: షర్మిల ఫైర్
విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి కి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి కి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. ఉచిత ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబు కి పోస్ట్ కార్డు రాసారు పీసీసీ చీఫ్. చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయిందని అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారన్నారు. తెలంగాణలో వారంలో అమలు చేశారని తెలిపారు. పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ? ఆర్టీసీ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని రోజు మహిళల ద్వారా 7 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. నెలకు 300 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ 300 కోట్లు ఆర్టీసీ కి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా అని నిలదీశారు.