Lavanya, Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇంటికి లావణ్య, న్యాయం చేయాలని విజ్ఞప్తి…?
హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), ఆయన మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Appeal to Pawan Kalyan's house for dignity and justice...?
హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), ఆయన మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి లావణ్య ఎక్కడి వరకు అయినా వెళ్లేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ (Raj Tarun) మాత్రం తన తప్పేమీ లేదని చెప్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఒక సినిమాను విడుదల చేసే పనిలో ఉన్న ఈ హీరో… ఈ వ్యవహారం తన సినిమాపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని కంగారు పడుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా అతను సరిగా పాల్గొనలేని పరిస్థితి ఉంది.
తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ (Prasad Labs) లో సినిమా ప్రీ రిలీజ్ (Pre Release) ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు నిర్మాతలు, హీరోయిన్ తో కలిసి అతను పాల్గొంటే… అక్కడికి లావణ్య వచ్చి రాజ్ తరుణ్ ని కలిసే ప్రయత్నం చేసింది. రాజ్ తరుణ్ తన భర్త అని ఆయన్ని కలవకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తనను కలిసే అవకాశం కల్పించాలని ఆమె పోలీసులను వేడుకుంది. తన భర్తతో మాల్వీ ఎందుకు ఉంటుందని ఆమె నిలదీశారు. తన భర్త తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఇప్పుడు న్యాయం కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి (AP Deputy Chief Minister) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలిసే అవకాశం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆమె కోరే ప్రయత్నం చేస్తుందని, అందుకోసం తన లాయర్ కళ్యాణ్ దిలీప్ తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన నివాసానికి వెళ్లి కలవాలని లావణ్య ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. ఇక కోర్ట్ మెట్లు ఎక్కి ఏ పోరాటం అయినా చేసేందుకు ఆమె సిద్దం కావడం ఇప్పుడు రాజ్ తరుణ్ ని కాస్త కంగారు పెట్టె అంశంగా చెప్పాలి.