Chandrababu : హైదరాబాద్ చేరుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దంపతులు..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

AP's former CM Chandrababu's couple reached Hyderabad..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) చీఫ్ చంద్రబాబు (Chandrababu) విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల (General Elections) పోలింగ్ తర్వాత ఆయన అమెరికా వెళ్లారు చేసిన విషయం తెలిసిందే… కాసేపటి క్రితమే చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు.. తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరవలి వచ్చారు.
చంద్రబాబు నేడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకుంటారని సమాచారం.. కాగా జూన్ 4న కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. మరో వైపు ఏపీ అపధర్మ ముఖ్యమంత్రి.. వైసీపీ (YCP) అధినేత సీఎం జగన్ (CM Jagan) జూన్ 1న లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.