JANASENA SEATS : జనసేనకు ఇచ్చే స్థానాలు ఇవేనా ? 23పై క్లారిటీ – 32కావాలన్న పవన్
ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన (TDP- Jana Sena) అధినేతలు బాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జరిపిన చర్చల్లో ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి రెండు దఫాలుగా ఏకంతంగా ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 32 సీట్లు అడుగుతుండగా... 20 చోట్ల ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కానీ 25 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఒప్పుకున్నారనీ... పవన్ మాత్రం 27 స్థానాలైనా కేటాయించాలని కోరినట్టు తెలిసింది.

Are these the positions given to Jana Sena? Clarity on 23 – Pawan wants 32
ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన (TDP- Jana Sena) అధినేతలు బాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జరిపిన చర్చల్లో ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి రెండు దఫాలుగా ఏకంతంగా ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 32 సీట్లు అడుగుతుండగా… 20 చోట్ల ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కానీ 25 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఒప్పుకున్నారనీ… పవన్ మాత్రం 27 స్థానాలైనా కేటాయించాలని కోరినట్టు తెలిసింది.
అసెంబ్లీ స్థానాల్లో పార్టీల విజయవకాశాలే లక్ష్యంగా సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు బాబు-పవన్ కల్యాణ్. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు కోరుతోంది. ఈ ఏరియాలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటు… పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలిసొస్తుందని జనసేన భావిస్తోంది. ఈనెల 8న మరోసారి భేటీ అవ్వాలని బాబు-పవన్ నిర్ణయించారు. 14న పాలకొల్లులో రెండు పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి సభను నిర్వహించి… అక్కడే మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు. బీజేపీ ఒంటరి పోరుకే వెళ్తుండటంతో టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు ఇక తొందరగా కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly election) పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే 23 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని స్థానాలపై రెండోసారి భేటీ తర్వాత తెలుస్తుందని అంటున్నారు. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతి నగరంలో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి.గన్నవరం, రాజానగరంలో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారు. రాజమండ్రి (రూరల్) లేదా తూర్పుగోదావరి జిల్లాలో మరో సీటును పవన్ కోరుతున్నారు. అమలాపురం, నరసాపురం, భీమవరంలో పోటీకి జనసేన సిద్ధమైంది. తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవనిగడ్డ సీట్లు జనసేనకే ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు. తిరుపతి లేక చిత్తూరులో జనసేన పోటీకి ఛాన్స్ ఉంది.
జనసేన (Jana Sena) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ లీడర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేనకు కేటాయించే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ లీడర్లను ముందే పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చాక… వాళ్ళకి ఏదో ఒక పదవిని సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. ఈ వారంలోనే టీడీపీ బుజ్జగింపుల కార్యక్రమాలు మొదలవుతున్నాయి.