YS Jagan : పార్టీ ఆఫీసుల పేరుతో ఇన్ని దారుణాలా.. ఇందుకు కదా నువ్ ఓడింది జగన్..
రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.. ఈ విషయం మర్చిపోయి అహంకారం తలకెక్కితే.. భగవంతుడు కూడా కాపాడలేదు. ప్రస్తుతం జగన్ పరిస్థితి ఇదే. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్..
రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.. ఈ విషయం మర్చిపోయి అహంకారం తలకెక్కితే.. భగవంతుడు కూడా కాపాడలేదు. ప్రస్తుతం జగన్ పరిస్థితి ఇదే. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. ఇక ఏపీ తనదే అనుకున్నారో.. మరో పాతికేళ్లు తనకు ఎదురు లేదనుకున్నారో.. ఎవరూ చూడరు అనుకున్నారో కానీ.. నియంతలా మారిపోయారు. ఇష్టం వచ్చింది చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణాల బాగోతాలు బయటపడుతుంటే.. దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయ్. ఇన్నాళ్లు ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదంటూ అమాయకంగా మొహం పెట్టిన జగన్ నియంత పాలన ఇదే అంటూ.. కూటమి సర్కార్ సాక్ష్యాధారాలతో సహా నిలదీస్తోంది. శనివారం ఉదయం.. సూర్యుడు కనిపించకముందే.. తాడేపల్లి రాజకీయం భగ్గుమండింది.
తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్‌ను అధికారులు కూల్చేశారు. సీతానగరంలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనం నిర్మిస్తున్నారు. నీటి పారుదల శాఖ స్థలంలో ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారని అధికారులు.. దాన్ని కూల్చేశారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని.. తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ వైసీపీకి కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అని.. సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చేశారు. తాడేపల్లిలో మాత్రమే కాదు.. వైజాగ్‌లోనూ ఇదే సీన్. విశాఖ పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ GVMC నోటీసులు జారీ చేసింది. ఎండాడలో 2ఎకరాల స్థలంలో.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతం వ్యక్తం చేసిన అధికారులు.. వారంలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి, విశాఖలోనే కాదు.. కర్నూలుతో పాటు చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణాలన్నీ అక్రమాలే ! ఈ బాగోతం బయటపడుతున్న కొద్దీ.. సంచలన నిజాలు బయటకు వస్తున్నాయ్. అధికారంలో చేతుల్లో ఉంది కదా అని జగన్ చేసిన దారుణాలు.. చేసిన అధికార దుర్వినియోగం విని, తెలుసుకొని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ఆఫీస్ కోసం సెలక్ట్ చేసుకున్న భూములు.. లీజ్‌కు తీసుకున్న విధానం.. జగన్ నియంత ధోరణికి అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
తాడేపల్లితో పాటు జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌ల కోసం.. 36 ఏళ్లకు స్థలాలను తీసుకున్నారు. ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల రుసుముతో మాత్రమే.. 36ఏళ్లకు ఈ స్థలాలను, భూములను లీజ్‌కు తీసుకున్నారు. ఏడాదికి వెయ్యి అంటే.. నెలకు అటు ఇటుగా 80 రూపాయలు. వైసీపీ ఆఫీస్‌ల కోసం ఏడాదికి వెయ్యి రూపాయలతో.. కేవలం వెయ్యి రూపాయలతో.. ఎకరాల స్థలాన్ని అడ్డంగా కొట్టేశారు. 36ఏళ్ల పాటు ఆ భూములు, స్థలాలు… తమ అధీనంలోనే పెట్టుకోవడానికి అగ్రిమెంట్‌లు రాసుకున్నారు. తాడేపల్లిలో అదే జరిగింది. విశాఖల పార్టీ ఆఫీస్ విషయంలో అదే కనిపించింది. దీన్ని దుర్మార్గం, దారుణం, ప్రజాధనం దుర్వినియోగం అనకడం కాకుండా ఇంకమనాలి.. పోనీ నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్‌లకు మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయా అంటే అవీ లేవ్. తనదే రాజ్యం.. తనదే ఇష్టం అన్నట్లుగా జగన్ వాటిని కనీసం పట్టించుకోలేదు.
ఇది కాదా నియంత పాలన అంటే ! పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం, కూల్చివేతల వ్యవహారం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఎవడబ్బ సొమ్మని ఇలా చేశావ్ జగన్ అంటూ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు టీడీపీ శ్రేణులు. జనం సొమ్మును ఇంత దుర్మార్మంగా దుర్వినియోగం ఎవరైనా చేస్తారా.. జగన్ తప్ప! ఆ ప్రేమ ఏమైందో.. ఆ ఆప్యాయత ఏమైందో.. ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు, అర్థం కాట్లేదని.. ఫలితాల తర్వాతఅమాయకంగా మొహం పెట్టి మాట్లాడిన జగన్.. ఇందుకు కాదు నువ్ ఓడిపోయావ్.. ఈ దుర్మార్గాలకే కదా జనం ఓడించారు నిన్ను అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయ్. ఇక చేసిన దారుణాలన్నీ చేసి.. జనం సొమ్ము మింగేసి.. ఇప్పుడు కక్షసాధింపు రాజకీయాలు అంటే ఎలా జగన్ అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.