Ashad festival : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు.. వారాహి నవరాత్రులు
ఇవాళ నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు జరగనున్నాయి. నేటి నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు నేడు దుర్గగుడి దేవస్థానం అమ్మవారికి సారె సమర్పించనున్నారు. అలాగే భక్తులు కూడా సారె సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రులి మహోత్సవాలు జరగనున్నాయి.
ఇవాళ నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు జరగనున్నాయి. నేటి నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు నేడు దుర్గగుడి దేవస్థానం అమ్మవారికి సారె సమర్పించనున్నారు. అలాగే భక్తులు కూడా సారె సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రులి మహోత్సవాలు జరగనున్నాయి. నెల రోజులపాటు అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులై 19 నుంచి 21 వరకు శాకాంబరీ ఉత్సవాలు జరగనున్నాయి.
ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగర్ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు..
ఇక మరోవైపు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో క్యూలో వేచి ఉంటున్నారన్నారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నాయి. 11:45 నుంచీ 12:15 వరకూ మహా నివేదన ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. 11:30 నుంచి 1:30 వరకు ప్రోటోకాల్ దర్శనాలు రద్దు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. జూలై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టువస్ర్తాల సమర్పణ ఉంటుంది. మల్లేశ్వర స్వామికి బంగారు తాపడం చేసిన కవచం, నాగాభరణం, మకరతోరణం, పీఠం దాతలు అందించారు.