Vanga Gita : పవన్‌దే గెలుపని వంగా గీత ఆడియో.. ఆమె మాటలకు అసలు అర్థం ఇదా..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఐతే ఈసారి పిఠాపురం నుంచి గెలుస్తారా.. అసెంబ్లీలో అడుగు పెడతారా అని సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐతే పవన్ గెలుపుపై జనసైనికులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సంబరాలకు సిద్ధం అయిపోయారు ఇప్పటి నుంచే ! ఐతే పవన్‌ను ఓడించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను.. బరిలో దింపింది.
వైసీపీ అధినేత జగన్.. ఆమెకు అన్ని రకాలుగా సపోర్ట్‌గా నిలిచారు. మంత్రులు, పార్టీ నేతలు.. వంగా గీత తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు.. పిఠాపురంలో ఏకంగా 86శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. దీనికి పవన్ కల్యాణే కారణం అనే టాక్ వినిపిస్తోంది. పవన్ గెలిపించుకునేందుకు విద్యార్థులు, యూత్ భారీగా తరలివచ్చారని.. అందుకే ఈ స్థాయిలో పోలింగ్ నమోదయిందని అంటున్నారు. దీంతో పిఠాపురం ఫలితం మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో.. పిఠాపురం వైసీపీ అభ్యర్ధి వంగా గీత మాట్లాడినట్లుగా.. ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్‌పై గీత ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనొక సెలబ్రెటీ అని.. ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెప్తూ.. ఈ ఎన్నికల్లో పవన్‌కు 80 నుంచి 90 వేల మెజారిటీ వచ్చే చాన్స్ ఉందన్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంగా గీతకు సీన్ అర్థం అయిందని.. అందుకే చేతులెత్తేశారని.. వైసీపీ పని ఔట్ అంటూ జనసైనికులు కామెంట్లు పెడుతున్నారు. ఐతే వంగా గీత ఒకటి మాట్లాడితే.. మరో ఆడియోను వైరల్ చేశారని వైసీపీ మద్దతుదారులు కామెంట్లు పెడుతుననారు. అది 80 నుంచి 90వేల మెజారిటీ కాదని.. పవన్‌కు 80 నుంచి 90వేల ఓట్లు మాత్రమే వస్తాయని వంగా గీత అన్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఓటమి ఖాయం అంటూ.. వంగా గీత అనుచరులు, వైసీపీ కార్యకర్తలు.. ఈ ఆడియో ఈ పోస్టులకు కౌంటర్ ఇస్తున్నారు. డీపీ ఫేక్ టెక్నాలజీ వచ్చాక.. రకరకాల ఆడియోలు వైరల్ అవుతున్నాయ్. ఇది కూడా అలాంటి ఆడియోనేనా అనే అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లు మరికొందరు.