Ayodhya Ram Mandir: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఎలా వెళ్లాలంటే..
భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల ప్రజలు దర్శించుకునేందుకు కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా అయోధ్యకు వెళ్లేందుకు రెండు రైళ్లను అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ.
Ayodhya Ram Mandir: ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది. అనంతరం మరుసటి రోజు.. అంటే జనవరి 23 నుంచి భక్తులందరికీ ఆలయ ప్రవేశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యవెళ్లి సీతా రాములను దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల ప్రజలు దర్శించుకునేందుకు కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
KTR: దేశంలోనే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.. ఎప్పుడూ ప్రజల్ని లైన్‌లో నిలబెట్టలేదు: కేటీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా అయోధ్యకు వెళ్లేందుకు రెండు రైళ్లను అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మొత్తం ఒకటిన్నర రోజుల పాటూ ప్రయాణించాచి అయోధ్య చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ కూడా అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి బుధవారం తెల్లవారుజామున 4.00 గంటలకు అయోధ్య జంక్షన్‌కు చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైు ఆగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున రాములవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్య చేరుకునేందుకు వీలుగా రైళ్ళ సంఖ్యను పెంచుతామని రైల్వేశాఖ వెల్లడించింది. రామ మందిరం ప్రారంభం తర్వాత 100 రోజుల పాటూ దేశంలోని పలుచోట్ల నుంచి వెయ్యి రైళ్ళను అయోధ్యకు ప్రత్యేకంగా నడుపుతామని రైల్వే శాఖ తెలిపింది.