Ayyannapatrudu speaker : ఆ 11 మంది తాట తీయడానికే… అయ్యన్నకి స్పీకర్ పదవి

స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఇప్పటికే డిసైడ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు... డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా పెట్టడం వెనుక బాబు స్కెచ్ మామూలుగా లేదన్న టాక్ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 18, 2024 | 04:16 PMLast Updated on: Jun 18, 2024 | 4:16 PM

Ayyannapatrudu Speaker

ఏపీ అసెంబ్లీ కొలువుతీరబోతోంది. ఈ నెల 21, 22న సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ముందుగా ప్రొటెమ్ స్పీకర్… ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. నెక్ట్స్… స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు. స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఇప్పటికే డిసైడ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు… డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా పెట్టడం వెనుక బాబు స్కెచ్ మామూలుగా లేదన్న టాక్ నడుస్తోంది.
చంద్రబాబుకు అయ్యన్న అంటే చాలా నమ్మకం. ఇప్పటికి 6 సార్లు మంత్రిగా పనిచేశారు. గత జగన్ ప్రభుత్వంపై పోరాడి… ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. అయ్యన్నపై అనేక కేసులు కూడా పెట్టింది గత ప్రభుత్వం. అయినా వెనక్కి తగ్గకుండా టీడీపీ తరపున పోరాటం చేశారు. అందుకే ఈసారి కేబినెట్లో ప్లేస్ ఇవ్వకుండా అయ్యన్నపాత్రుడిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడుతున్నారు సీఎం చంద్రబాబు. ఆయన అయితేనే అసెంబ్లీని పూర్తిగా కంట్రోల్లో పెడతారన్న నమ్మకం ఉంది. స్పీకర్ స్థానం చాలా ఉన్నతమైంది. ఆ స్థానంలో ఉండే వ్యక్తికి ఎంతో హుందాతనం ఉండాలి. సీనియారిటీ విషయంలో అయ్యన్నకు మించిన వారు లేరు. ఏడోసారి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడుకి కాస్త ఆవేశం ఎక్కువ. అంతకి మించి చెప్పాలంటే… బూతులు తిట్టడంలో దిట్ట అంటారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని ధీటుగా ఎదుర్కునే సత్తా అయ్యన్నకే ఉందని చెబుతారు. ఎందుకంటే గత ఐదేళ్ళుగా కొడాలి నాని వాడిన భాష ఎలాంటిదో అందరికీ తెలుసు. వైసీపీ మంత్రులు, నేతల నోటి దూలవల్లే ఏపీ జనం విసుగెత్తిపోయి… ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. మరి ఇప్పుడు స్పీకర్ గా అయ్యన్న ఇవ్వడం ద్వారా వైసీపీ లీడర్ల నోటికి తాళం వేయాలని బాబు ఆలోచించారా … టీడీపీలో ఆ పదవిని ఆశించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘు రామ రాజు అయితే ఎన్నికలకు ముందు నుంచే స్పీకర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన్ని కూడా కాదని అయ్యన్నకు స్పీకర్ ఇవ్వడానికి ఇదే కారణమని అంటున్నారు. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత అయ్యన్న భాష మారవచ్చేమో గానీ… వైసీపీ ఎమ్మెల్యేల తాట తీయడం మాత్రం ఖాయమన్న టాక్ నడుస్తోంది.