Babu as CM :వరుస సమీక్షలు – ఆదేశాలు చంద్రబాబు సీఎం అయ్యారా ?
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే... మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి… రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే… మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం… ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై తమ పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఈమధ్య 3 కీలక అంశాలపై దృష్టిపెట్టారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం బటన్లు నొక్కుతున్నారు. ఎన్నికల ముందు కూడా బటన్లు నొక్కారు కానీ… లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ బటన్ నొక్కి డబ్బులివ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. అయితే పోలింగ్ ముందు ప్రతిపక్షాల అభ్యంతరాలతో డబ్బులు ఆగాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరి ఎన్నికల తర్వాత ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు చంద్రబాబు. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. దాంతో చంద్రబాబు గవర్నర్ కు లెటర్ రాశారు. వెంటనే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయించాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్ ఆదేశాలతో డబ్బులు రిలీజ్ అయ్యాయి.
ఏపీలో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లెటర్ రాశారు. ఏపీలో కేంద్ర బలగాలు పెట్టాలని కోరారు. దాంతో స్పందించిన ఈసీ.. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా రెండు వారాల పాటు కేంద్ర బలగాలు ఏపీలో కొనసాగాలని ఆదేశించింది. ఇంకా ప్రభుత్వ జీవోలు దాచే ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. జీవోలను తొలగించేందుకు ఈ టైమ్ లో అప్ గ్రేడేషన్ మొదలుపెట్టారని చంద్రబాబు అనుమానించారు. వెంటనే ఈ ప్రక్రియ ఆపేయాలనీ… కొత్త ప్రభుత్వం వచ్చాక చేపట్టాలని కోరారు. చంద్రబాబు డిమాండ్ ను గవర్నర్ తో పాటు ఈసీగా కూడా ఆమోదించాయి. ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామాలతో చంద్రబాబే నెక్ట్స్ సీఎం అంటూ టీడీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
వారణాసిలో మోడీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళొస్తూ… చంద్రబాబు షిరిడీలో సాయిబాబా దర్శనానికి వెళ్ళారు. అక్కడో మహారాష్ట్ర అధికారి… చంద్రబాబు నాయుడిని ఏపీ ముఖ్యమంత్రిగా పరిచయం చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు సీఎం అయినట్టేనని తెలుగుదేశం వర్గాలు తెగ సంబరపడుతున్నాయి.