AMITH SHA ON TDP : బాబుకి బుద్దొచ్చి మాతో కలిశాడు… వైసీపీతో పొత్తు ఎందుకు లేదంటే…
చంద్రబాబు (Chandrababu) నాయుడిని NDA కూటమి నుంచి వెళ్ళిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో... టీడీపీ (TDP) తో పొత్తుపై మాట్లాడారు అమిత్ షా.
చంద్రబాబు (Chandrababu) నాయుడిని NDA కూటమి నుంచి వెళ్ళిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో… టీడీపీ (TDP) తో పొత్తుపై మాట్లాడారు అమిత్ షా. ఆరేళ్ళ పాటు NDAకు దూరంగా ఉన్న టీడీపీ… ఏపీలో జగన్మోహన్ రెడ్డిని (Jagan Mohan Reddy) అధికారం నుంచి దింపడానికి మళ్ళీ బీజేపీతో జత కట్టింది. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో కలసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఈ పొత్తు గురించి ఇప్పటి దాకా బీజేపీ హైకమాండ్ లీడర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొదటిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీతో పొత్తుపై స్పందించారు.
జగన్ మోహన్ రెడ్డిని కాదని టీడీపీతో ఎందుకు జతకట్టారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. NDA నుంచి వెళ్ళిపోవాలని తామెప్పుడూ చంద్రబాబుకు ఎప్పుడూ చెప్పలేదన్నారు అమిత్ షా. ఆయనే వెళ్ళిపోయారు. తిరిగి రమ్మని కూడా అడగలేదు. ఆయనే తిరిగొచ్చి మాతో చేతులు కలిపాడని కామెంట్ చేశారు. ఎన్టీఏ కూటమిలో ఉన్న ఎవరినీ మేము కాదనుకోలేదు… వచ్చి కలుస్తామంటే వద్దనలేదని చెప్పారు అమిత్ షా. అదే టైమ్ లో వైసీపీ గురించి కూడా స్పందించారు. పార్లమెంట్ లో వైసీపీ (YCP) కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కదా… అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు… చంద్రబాబుతో ఎందుకు కలిశారన్న ప్రశ్నకు అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ లో ఓటింగ్ కు… రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు సంబంధం లేదన్నారు. బీజేపీ (BJP) ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ ఓట్లు వేయలేదు… మూడుసార్లు మా విధానాలను ఆ పార్టీ వ్యతిరేకించింది. ఓటింగ్ కు దూరంగా ఉందన్నారు అమిత్ షా. ఆ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా ఉండటం వల్లే తప్ప బీజేపీ కోసం ఓటు వేయలేదు. పార్లమెంట్ లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవన్నారు అమిత్ షా. ఆయా పార్టీలకు సొంత అజెండాలు ఉంటాయనీ… దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటేనే ఏ పార్టీ అయినా బిల్లులకు ఓటు వేస్తుందన్నారు.
బీజేపీయే తమతో చేతులు కలపాలని ఇంట్రెస్ట్ చూసించిందని కొందరు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ నిజం కాదని ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలతో తేలిపోయింది. జగన్ ను ఢీకొట్టాలంటే కేంద్రంలో బీజేపీ సాయం కావాలని చంద్రబాబు గ్రహించారు. అందుకే తాను వెళ్ళి NDAలో తిరిగి చేరతారని అడిగినట్టు అర్థమవుతోంది.