జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ సినీ నటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ సినీ నటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలకృష్ణ మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో ఇటువంటి విపత్తు రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి సమయంలో నిరాశ్రయులు అయినవారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని బాలయ్య పిలుపునిచ్చారు. కళాకారులు వారి వారి షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటారన్న బాలయ్య సమయం దొరికింది కాబట్టి వచ్చి మేము ప్రకటించిన సహాయాన్ని ప్రభుత్వానికి మేము అందజేస్తాం అన్నారు.
గతంలో దివిసీమలో ఉప్పెన వచ్చిన సందర్భాల్లో కూడా నాన్నగారు జోలి పట్టి మరి అడిగి సహాయం చేసినటువంటి మహనీయులు అని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేసారు. ఇటువంటి విపత్తు ప్రభుత్వం సృష్టించిందని వారు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు బాలయ్య.