TDP, Balakrishna : నేడు రాయలసీమలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ‘స్వర్ణాంధ్ర సాకరయాత్ర’ ఎన్నికల ప్రచారం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ప్రచారనికి సినీ నటుడు.. టీడీపీ సీనియర్ నేత.. హిందూపురం ఎమ్మెల్యే (Hindupuram MLA) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సిద్ధం అయ్యారు.

Balakrishna's election campaign in Rayalaseema today is the 'Golden Andhra Sakaryatra' election campaign
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ప్రచారనికి సినీ నటుడు.. టీడీపీ సీనియర్ నేత.. హిందూపురం ఎమ్మెల్యే (Hindupuram MLA) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సిద్ధం అయ్యారు. నేటి నుంచి బాలయ్య రాయలసీమలో ‘స్వర్ణాంధ్ర సాకరయాత్ర’ (Swarnandhra Sakaryatra) ప్రారంభించనున్నారు. ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పార్టీ మరో సీనియర్ నాయకుడు అయిన బాలకృష్ణ మాత్రం ఇంకా ప్రచారానికి రాలేదు.
ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ (Balayya Unstoppable) పేరుతో ఓ ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. ఇక ఇవాళ ఉదయం కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు బాలయ్య. ఇక ఏప్రిల్ 19న బాలయ్య హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ (TDP) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఏప్రిల్ 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి బాలకృష్ణ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.
SSM