CM Revanth, Balayya : రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఏం మాట్లాడుకున్నారంటే…

కొన్ని మీటింగ్స్ ఆసక్తి రేపుతాయ్.. మరికొన్ని సమావేశాలు ఉత్సాహం క్రియేట్ చేస్తాయ్. అలాంటి మీటింగ్ ఒకటి జరిగింది హైదరాబాద్‌లో ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 01:07 PMLast Updated on: May 26, 2024 | 1:07 PM

Balayya Met Revanth What Did They Talk About

కొన్ని మీటింగ్స్ ఆసక్తి రేపుతాయ్.. మరికొన్ని సమావేశాలు ఉత్సాహం క్రియేట్ చేస్తాయ్. అలాంటి మీటింగ్ ఒకటి జరిగింది హైదరాబాద్‌లో ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. మర్యాదపూర్వకంగానే రేవంత్ రెడ్డిని ఆయన కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలకృష్ణ ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు. ఓసారి సెక్రటేరియట్‌లో అలా పుష్పగుచ్చం ఇచ్చి వెళ్లిపోయారు అంతే. సినిమా షూటింగ్‌ల తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ… అప్పుడు కూడా ఆయనను కలవలేకపోయారు. మర్యాదపూర్వకంగానే… అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ… ఆయనకు అభినందనలు తెలిపారు. వాళ్లిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఏపీ రాజకీయాలపైన వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారని తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ సరళి… తర్వాత జరిగిన పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.