BALAIAH WARNING : హోంమంత్రి అనితకు.. బాలయ్య వార్నింగ్

బాలయ్యనా మజాకా... ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇత్తడై పోద్ది. ఏపీ హోంమంత్రి అనితకి కూడా బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2024 | 12:37 PMLast Updated on: Jul 10, 2024 | 12:37 PM

Balayyas Warning To Home Minister Anita

 

 

బాలయ్యనా మజాకా… ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇత్తడై పోద్ది. ఏపీ హోంమంత్రి అనితకి కూడా బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. కేబినెట్ లో చోటు దక్కకపోయినా… నాన్న స్థాపించిన టీడీపీ… బావ చంద్రబాబు ముఖ్యమంత్రి… అల్లుడు లోకేశ్ రాష్ట్ర మంత్రి. ఇక తగ్గేదేలే అంటున్నాడు. అందుకే ఏకంగా హోంమంత్రినే హెచ్చరించాడు. ఇంతకీ గొడవేంటయ్యా అంటే… బాలకృష్ణ సన్నిహితులను హోంమంత్రి అనిత అనుచరులు కెలకడంతో ఈ వివాదం తలెత్తింది.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ లీడర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి… తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ హడావిడి చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో చివరకు చంద్రబాబు ఆ మంత్రిని హెచ్చరించారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఇప్పుడు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై… హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనిత అనుచరులు కొందరు బాలకృష్ణ సన్నిహితులతో గొడవకు దిగడమే ఇందుక్కారణం. దాంతో అనితకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నవరంలో వన్ అనే పెద్ద హోటల్ ఉంది.

ఇది నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఈమధ్య పాయకరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ హోటల్ కు వెళ్ళారు. అక్కడ జనంతో కిక్కిరిసిపోయి ఉన్న టైమ్ లో టీడీపీ నేతలు గంటల కొద్దీ అక్కడే తిష్టవేశారు. సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. దాంతో తాము హోంమంత్రి అనిత మనుషులం అన్న ధీమాతో హోటల్ సిబ్బందితో గొడవ పడ్డారు. వారిపై దాడికి కూడా పాల్పడ్డారు. దాంతో హోటల్ సిబ్బంది అమెరికాలో ఉన్న తమ యజమానికి సమాచారం అందిచారు. ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. జరిగిన సంగతి బాలయ్యకు చెప్పడంతో… వెంటనే మంత్రి అనితకు కాల్ చేశారు. మీ వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకో… లేకపోతే ఏం చేస్తానో తెలుసా అని వార్నింగ్ ఇచ్చారట బాలకృష్ణ. ఈ గొడవ సీఎం కార్యాలయం దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది. బాలయ్య, అనిత మధ్య వార్ పై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.