Pithapuram : పిఠాపురం చరిత్రలోనే ఈసారి భారీ పోలింగ్‌…

ఏపీలో ఎట్టకేలకు పోలింగ్‌ ముగిసింది. ఎన్నిలకపై గతంలో ఎప్పుడూ లేనంత ఇంట్రెస్ట్‌ ఇసారి అందరికీ కలిగింది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎక్కడెక్కనుంచో ఓటర్లు ఏపీకి చేరుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2024 | 10:25 AMLast Updated on: May 15, 2024 | 10:45 AM

Big Polling In The History Of Pithapuram This Time

 

 

 

ఏపీలో ఎట్టకేలకు పోలింగ్‌ ముగిసింది. ఎన్నిలకపై గతంలో ఎప్పుడూ లేనంత ఇంట్రెస్ట్‌ ఇసారి అందరికీ కలిగింది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎక్కడెక్కనుంచో ఓటర్లు ఏపీకి చేరుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదే క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో కూడా ఓటింగ్‌ బారీగా నమోదైంది. పిఠాపురంలో 86.63 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది.

ఇదే పిఠాపురంలో గత ఎన్నికల్లో 81.1 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే గతంతో కంపేర్‌ చేస్తే పిఠాపురంలో 5 శాతం ఓటింగ్‌ పెరిగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 409 మంది ఓటర్లు ఉంటే.. అందులో 2 లక్షల 4 వేల 811 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ స్థాయిలో పోలింగ్‌ జరగడం.. ఇంత మంది తమ ఓటుహక్కు వినియోగించుకోవడం పిఠాపురం చరిత్రలోనే ఇదే తొలిసారి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఈ సెగ్మెంట్‌ కీలకంగా మారిపోయింది. దీనికి తోడు కాకినాడలో కాపు ఓటింగ్‌ ఎక్కువ. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్లే ఇక్కడ డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. దానికితోడు కల్ట్‌ పవన్‌ ఫ్యాన్స్‌ అడ్డాగా కూడా కాకినాడకు పేరుంది.

ఇదే జనసేనకు ఇక్కడ ప్లస్‌ అయ్యే అవకాశం. ఇక వైసీపీ ప్రభుత్వంపై యువకుల్లో ఉన్న వ్యతిరేకత ఈసారి ఓటింగ్‌ శాతం పెరగడానికి ముఖ్య కారణంగా మారింది. సంక్షేమం సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు అనే వాదనను కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. ప్రజలు కూడా అధే భావనతో ఉండటంతో ఈ వ్యతిరేకత ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ స్థాయిలో పెరిగిన ఓటింగ్‌ జగన్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది పవన్‌ను ఎక్కడ నిలబెడుతుందో చూడాలి.