BJP Purandeswari : రాజమండ్రి సీటు సిద్దం చేసుకుంటున్న పురంధేశ్వరి

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై బీజేపీలో మెల్లిగా క్లారిటీ వస్తున్నట్టే కనిపిస్తోంది. పొత్తుల సంగతి పక్కనపెడితే... అది ఉన్నా, లేకున్నా, తమకు అనుకూలమైన సీట్లు వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారట సీనియర్‌ లీడర్స్‌. ఏపీ బీజేపీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 09:12 AMLast Updated on: Jan 31, 2024 | 9:12 AM

Bjp Purandheswari Rajamundry Mp Ticket

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై బీజేపీలో మెల్లిగా క్లారిటీ వస్తున్నట్టే కనిపిస్తోంది. పొత్తుల సంగతి పక్కనపెడితే… అది ఉన్నా, లేకున్నా, తమకు అనుకూలమైన సీట్లు వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారట సీనియర్‌ లీడర్స్‌. ఏపీ బీజేపీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయిందంటున్నారు. విశాఖ ఎంపీ (Vizag MP) స్థానం నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ఇప్పటికే సై అంటున్నారు. అక్కడే పాగా వేసి రక రకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారాయన. మరోవైపు విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేలా విష్ణుకుమార్ రాజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో పురందేశ్వరి విశాఖ, రాజంపేట లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసినందున మళ్ళీ ఆ పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి.. అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా కాదు… మొదటి నుంచి పురంధేశ్వరి లోక్‌సభ అభ్యర్థే కాబట్టి అదే కరెక్ట్‌ అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. అదే నిజమైతే… విశాఖలో జీవీఎల్, రాజంపేట నుంచి కిరణ్  కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నందున…పురందేశ్వరి ఒంగోలు లోక్‌సభ బరిలో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్నాళ్ళు ఇలా రకరకాల మాటలు వినిపించగా…. ఇప్పుడు తూచ్‌… అవేవీ కాదు, ఆమె రాజమండ్రి (Rajamandry) నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇంకా జోరుగా జరుగుతోంది.

రాజమండ్రి బరి కోసం పురందేశ్వరి ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి గోదావరి తీరాన్ని ఎంచుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు గెలిచిన చరిత్ర ఉంది. అలాగే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అన్ని విధాలా పురందేశ్వరికి సహకరించే కొంతమంది లీడర్లు ఉండటంతో ఆమె అటు వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు ఇంకో చర్చా జరుగుతోంది. వాస్తవానికి పురందేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినా.. అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ బరిలో ఉంటే… కుటుంబంలోనే సీటు కోసం పోటీ అనే చర్చ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో అన్నివిధాలా ఆలోచించే… రాజమండ్రి అయితే బెస్ట్ అనే భావనతో గోదావరి జిల్లా వైపు పురందేశ్వరి చూస్తున్నట్టు తెలిసింది. మరి ఆమె లెక్కలు పక్కాగానే ఉన్నాయా? ఫైనల్‌ బరి గోదావరి తీరమేనా అన్నది చూడాలి.