AP politics : టీడీపీతో పొత్తు కోసం.. ఏపీ బీజేపీ వెంపర్లాట
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అయోమయంగా ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన.. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ నేతలు.. వీళ్ళంతా యాక్టివ్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం జనంలో తిరుగుతున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదు. పొత్తు కోసం టీడీపీ పిలుస్తుందా.. లేదా మనమే అడుక్కోవాలా.. ఒంటరిగా పోటీ చేస్తే.. వచ్చే నాలుగు సీట్లు కూడా రాకుండా పోతాయా.. ఏం చేయాలో అర్థంకావట్లేదు బీజేపీ నేతలకు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అయోమయంగా ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన.. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ నేతలు.. వీళ్ళంతా యాక్టివ్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం జనంలో తిరుగుతున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదు. పొత్తు కోసం టీడీపీ పిలుస్తుందా.. లేదా మనమే అడుక్కోవాలా.. ఒంటరిగా పోటీ చేస్తే.. వచ్చే నాలుగు సీట్లు కూడా రాకుండా పోతాయా.. ఏం చేయాలో అర్థంకావట్లేదు బీజేపీ నేతలకు. ఓ లీడరైతే.. పొత్తులు కావాలంటే టీడీపీయే సంప్రదించాలి అంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. చంద్రబాబుకు పవన్ తో రాయబారం కూడా పంపుతున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే.. తమ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్ళాలంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్ ని టీడీపీ నేతలు సంప్రదించాలని కోరారు. ఏపీ బీజేపీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి టీడీపీ ముందుకు రావట్లేదు. గడచిన పదేళ్ళల్లో బీజేపీ ఏపీకీ చేసిందేమీ లేదు. స్పెషల్ స్టేట్ విషయంలోనూ మోసం చేసిందన్న కోపం ఆంధ్రప్రజలకు ఉంది. పైగా మైనార్టీల ఓట్లు కూడా కోల్పోతాం. తమ పార్టీని ఎదగనీయకుండా చేస్తుంది. అందుకే కమలంతో పొత్తు వద్దని టీడీపీ సీనియర్ నేతలు ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు. బాబు కూడా NDA కూటమీ లేదా ఇండియా కూటముల్లోకి వెళ్ళకుండా ప్రస్తుతానికి తటస్థంగా ఉండాలని అనుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. గెలిచి అధికారంలోకి వచ్చాక.. అప్పుడు ఆలోచిద్దాం అనే ధోరణిలో ఉన్నారని అంటున్నారు.
అందుకే బాబు కూడా జనసేనతో పొత్తు వరకే పరిమితం అయ్యారే తప్ప.. బీజేపీ గురించి మాట్లాడటం లేదు. బీజేపీ నేతలకు టీడీపీని అడగాలంటే అహం అడ్డొస్తోంది. జాతీయ పార్టీ అయి ఉండి. చంద్రబాబే తమను సంప్రదించాలి తప్ప.. తాము వెళ్ళి అడుక్కోవడం ఏంటన్న ధోరణి కమలనాధుల్లో కనిపిస్తోంది. బీజేపీతో దోస్తీ చేస్తున్నజనసేన మాత్రం టీడీపీతో కలసి… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. మరి కమలం పార్టీని ఏం చేస్తుందన్నది తెలియడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు, సీట్లు, పొత్తులపై గురువారం అంతా రాష్ట్రస్థాయి నేతలతో బీజేపీ పెద్దలు సమావేశం అయ్యారు. అయితే స్థానిక నేతలు మాత్రం.. ఏదో ఒక పార్టీతో పొత్తు లేకపోతే ఓట్లు వస్తాయేమో గానీ.. సీట్లు రావని తేల్చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే కష్టమేననీ.. మోడీ మేనియా కూడా ఏపీలో పనిచేయదని చెప్పేశారు. టీడీపీతోనే వెళితేనే బెటర్ అని ఎక్కువ మంది ఏపీ కమలం నేతలు రాతపూర్వకంగా రాసిచ్చారు. ఆ లెటర్లు అన్నీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. పార్టీ హైకమాండ్ కు పంపుతున్నారు. ఆమెకు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అన్నట్టుగా ఉంది. కానీ హైకమాండ్ ఏది చెబితే అది వినాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ కు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ తరపున బాబుతో మాట్లాడాలని. మొత్తానికి మరో 3 నెలల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పెట్టుకొని.. ఏపీ బీజేపీ లీడర్లు మాత్రం ఎవరు పొత్తుకు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు.